రభస స్వరాల సంరంభం

రభస స్వరాల సంరంభం

జూనియర్ ఎన్టీఆర్ నటించిన రభస చిత్రం పాటల పండగ సందడి చేసింది. హైదరాబాదులో ఆగస్ట్ ఒకటో తేదీ సాయంత్రం జరిగిన ఈ ఉత్సవంలో రభస సి డీ ని ఆవిష్కరించారు. పాటల సి డీ ని ప్రముఖ దర్శకులు రాజమౌళి ఆవిష్కరించి మరొక ప్రముఖ దర్శకులు వీ వీ వినాయక్ కు సమర్పించారు.

బెల్లకొండ గణేష్ బాబు నిర్మించిన రభస చిత్రానికి దర్శకులు సంతోష్ శ్రీనివాస్. సంతోష్ శ్రీనివాస్ కు జూనియర్ ఎన్టీఆర్ తో ఇది మూడో చిత్రం. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హీరో కాగా సమంతా, ప్రణీత కథానాయికలు.

జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో అచ్చ తెలుగు ఆడపిల్లలా …కొత్త కొత్త ఆవకాయిలా … అంటూ పాడి అందరినీ అలరించారు.

జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ” నేను పదిహేడేళ్ళ వయస్సులో చిత్ర పరిశ్రమకు వచ్చాను. ఓ తల్లితండ్రికి పుట్టిన నేను ఈ రోజు తండ్రి స్థాయిలో మీ ముందు నిల్చున్నాను. నాకు దేవుడు మా తాతగారు నందమూరి తారక రామారావు. ఆయన దీవెనలు, అభిమానుల ఆదరణ నాకు ఎప్పుడూ ఉండటం వల్లే ఈ స్థాయికి చేరాను. పది నెలలు పడిన శ్రమలో పుట్టిన రభస సినిమా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కోసమైనా విజయవంతం కావాలి. ఈ చిత్రం ప్రారంభించినప్పటి నుంచి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. సంతోష్ శ్రీనివాస్ మధ్యలో అనారోగ్యం పాలయ్యారు. అయినాకూడా అన్ని ఇబ్బందులను, సమస్యలను అధిగమించి సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని చక్కగా తీర్చిదిద్దారు. ఆ మంచి మనిషి కోసమైనా ఈ సినిమా విజయం సాధించాలి. ఈ సినిమాకు తమన్ గొప్ప సంగీతం అందించారు” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, బండ్ల గణేష్, దిల్ రాజ్, శ్రీమణి, వంశీ పైడిపల్లి, కోన నీరజ, బీ ఏ రాజు తదితరులు పాల్గొన్నారు.

Send a Comment

Your email address will not be published.