రూపుదిద్దుకోనున్న సౌందర్య బయోపిక్

రూపుదిద్దుకోనున్న సౌందర్య బయోపిక్

దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు సౌందర్య. 1992 నుంచి 2004 వరకు బిజీ హీరోయిన్‌గా ఉన్న ఆమె తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. 2004 ఏప్రిల్‌ 17న హెలీకాప్టర్‌ ప్రమాదంలో సౌందర్య మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె బయోపిక్‌ తెరకెక్కనుందని టాక్‌.

మలయాళ సినిమా ఇండస్ట్రీలోని ఒక బడా నిర్మాణ సంస్థ సౌందర్య బయోపిక్‌ని సౌత్‌ ఇండియాలోని అన్ని భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సౌందర్య బయోపిక్‌ కోసం ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆమె పాత్రకు సాయిపల్లవిని సంప్రదించినట్లు టాక్‌. ఎందరో ప్రేక్షకులు ముఖ్యంగా మహిళల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సౌందర్య లాంటి మంచి నటి పాత్ర చేసే అవకాశం వస్తే సాయి పల్లవి చేయకుండా ఉంటారా? చేస్తారనే ఊహించవచ్చు.

Send a Comment

Your email address will not be published.