రూమీ ముత్యాలు

రూమీ ముత్యాలు

చీకటి కావాలంటే
చెట్లను
చెట్లలోని పువ్వుల్ని
దాచొచ్చు
కానీ
అది మనసులోని ప్రేమను
దాచలేదు
——————————–
ప్రేమ ఒక్కటే
ప్రేమలోని అంతుబట్టని విషయాలను
వివరించగలదు
————————————-
దేవుడి కాంతి
స్త్రీ
—————————–
విను
వినదలచుకుంటే
అతనిని చేరుకోవాలంటే
నువ్వు పయనించవలసిందే
అంతిమంగా
నువ్వు చేరేసరికి
అక్కడ మౌనం నిన్ను చూస్తుంది
నువ్వూ మౌనంగానే ఉండాలి
అక్కడ ఏమీ అనకు
వినగలగాలి
——————————-
నువ్వు
లోలోపలలికి
వెళ్లి నిన్ను నువ్వు తెలుసుకునే కొద్దీ
అక్కడ అది మరింత
స్పష్టంగా ఉంటుంది
——————————-
నేను సూర్యుడితోనే మాట్లాడుతాను
ఎందుకంటే
సూర్యుడే నా గురువు
అతని పాదాల దగ్గర ధూళినైనా
ఆరాధిస్తాను
నేను
రాత్రి ప్రేమికుడిని కాను
నిద్రను కొనియాడను
నేను సూర్యుడి దూతను
నేను రహస్యంగా అడుగుతాను
అంతే రహస్యంగా
జవాబులు చేరవేస్తాను
నేను నన్ను మైమరచినట్టు కనిపించవచ్చు
కానీ నిజమే మాట్లాడుతాను
ముసుగు చించి పారేసే
నీ ముఖం ఎంత అందమైనదో తెలుసుకో
నీ హృదయం రాయి అంత చల్లగా ఉండొచ్చు
కానీ
నేను నా మండే వేడితో
వెచ్చగా మారుస్తాను
ఇక నేను మాట్లాడను
సూర్యాస్తమయాలు గురించి కానీ
చంద్రోదయాల గురించి కానీ
నేను
ప్రేమామృతాన్ని
తీసుకొస్తాను నీకు
నేను సూర్యుదినుంచి పుట్టినందుకు
నేను రాజుని
——————————–
నీ వెలుగులో
ఎలా ప్రేమించాలో
నేను నేర్చుకున్నాను
—————————–
స్నేహంలో
కాలం కరిగిపోతుంది
—————————-
అనుసృజన
యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.