రేవంత్ కొత్త ప్రాజెక్టు

రేవంత్ కొత్త ప్రాజెక్టు
నటుడు రేవంత్ గుర్తున్నాడా….?
ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో ఎక్కడపడితే అక్కడ రేవంత్ నటించిన ఇంటింటా అన్నమయ్య సినిమా పోస్టర్లు కనిపించేవి. ఈ చిత్రంలోనే  రేవంత్ మొదటిసారిగా నటించాడు. ఈ సినిమా దాదాపు ఏడాది క్రితమే విడుదల కావలసింది. కానీ అప్పుడు ఇప్పుడు అంటూ వాయిదా పడుతూ వస్తోంది ఈ చిత్రం విడుదల తేదీ. అయితే  ఎందుకు ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదోనని కారణాలు ఎవరికీ తెలియవు.
ఆ చిత్రం మాటేమోగానీ ఇప్పుడు రేవంత్ కు మరో కొత్త పిక్చర్ ఆఫర్ వచ్చింది. ఆ కొత్త చిత్రానికి రేవంత్ సంతకాలు చేసినట్లు తెలిసింది.
ప్రొడ్యూసర్ దిల్ రాజ్ తన తదుపరి చిత్రం కేరింత కు కొత్త నటీనటుల కోసం అన్వేషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అడివి సాయికిరణ్ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రంలో నటించేందుకు రేవంత్ ఒప్పందం చేసుకున్నాడు. ఒకవేళ ఈ చిత్రం అనుకున్న టైం కి పూర్తయి విడుదల అవుతే ఇదే అతనికి తొలి చిత్రంగా  ప్రేక్షకుల ముందుకు వచ్చినట్టు అవుతుంది.

Send a Comment

Your email address will not be published.