వచ్చేసింది..లక్ష్మీ రావే మా ఇంటికి

వచ్చేసింది..లక్ష్మీ రావే మా ఇంటికి
నాగశౌర్య, అవికా గోర్ జోడీగా నటించిన చిత్రం ‘లక్ష్మీరావే మా ఇంటికి’. ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ సినిమాకు నంద్యాల రవి దర్శకత్వం వహించారు. గిరిధర్ ప్రొడక్షన్స్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇదొక ప్రేమ కథా చిత్రం. దర్శకుడు రవి ఈ సినిమాను ఒక చక్కని కధగాను, అంతకన్నా చిక్కగా కథనం మలిచానని  చెప్పుకున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులందరూ తాము మంచి సినిమా చూసామనే అనుకుంటారు అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.
ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యతో వంటి చిత్రాలతో ప్రేమకథలకు అచ్చంగా సరిపోతాడనే ముద్ర వేయించుకున్న నాగ శౌర్యకు జోడీగా నటించిన అందాల రాశి అవిగోర్ చిన్నారి పెళ్ళికూతురు బుల్లి తేరా సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు చిరుపరిచితురాలే. . పైగా ఆమె టాలీవుడ్ లో నటించిన తోలి సినిమా ఉయ్యాలా జంపాలాతో మరింత చేరువైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో అవిగోర్ నటన ఎంతో బాగుందనే టాక్ ఇప్పటికే వచ్చింది.
ఈ సినిమాకు కె ఎం రాధాకృష్ణన్ సంగీతం సమకూర్చారు. రాధాకృష్ణన్ సంగీతం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన స్వరాలు వినీవినగానే ఆకట్టుకుంటుందని చెప్పడానికి ఆలోచించ వలసిన పని లేదు. .
మొత్తం మీద ఈ సినిమా బాగానే ఉంది. నాగశౌర్యకు ఈ సినిమాతో మరింత ఎదుగుతాడని అభిమానుల ఆశ. ధీమా.

Send a Comment

Your email address will not be published.