వలసదారుల్లో భారతీయులే ఎక్కువ

Permanent Migrants

ఆస్ట్రేలియాలో 2000 సంవత్సరం నుండి 2016 వరకు వలసదారుల్లో భారతీయుల సంఖ్య అత్యంత గణనీయంగా పెరిగింది. 292,000 మంది వలస రాగా అందులో 234,000 మంది నైపుణ్యం (Skilled) వర్గంలోనే వుండడం భారతీయుల మేధా సంపత్తి ఆస్ట్రేలియా దేశ పురోభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందన్నది చెప్పుకోవలసిన విషయం. రెండో స్థానంలో వున్న చైనా ఈ (Skilled) వర్గంలో 146842. భారతీయు వలసదారుల్లో ఇది 63 శాతం మాత్రమే. ఒకప్పుడు చైనా దేశం నుండి ఎక్కువమంది రావడం జరిగేది. కానీ ఈ మధ్య భారతదేశం నుండి ఎక్కువ మంది రావడం గమనార్హం.

Permanent Migrants3భారతీయుల్లో ఎక్కువమంది ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకొని ఆస్ట్రేలియా ఆర్ధిక సామాజిక వ్యవస్థకు తోడ్పడడమే కాకుండా ఆస్ట్రేలియాలో ప్రతీ పౌరుడు ఇల్లు కొనుక్కోవాలనే కలను సాకారం చేసుకుంటున్నారు. 54 శాతం స్వంత ఇల్లు కొనుక్కొని ఈ దేశంలో నిలదోక్కుకోవాలన్న తమ నిబద్ధతను తెలుపుకుంటున్నారు.

అయితే హుమనిటేరియన్ వీసా లో వచ్చిన వారు మాత్రం ఇక్కడ నివాసం ఏర్పరుచుకోవడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు.

సాధారణంగా ఇక్కడికి వచ్చిన వలసదారులు ఈ క్రింది ఉద్యోగాలు/పరిశ్రమలలో స్థిరపడుతున్నారు
1. Food and Beverage Services
2. Professional, Science & Technical
3. Hospitals
4. Retail
5. Medical & health care
6. Residential Care services
7. Computer System Design
8. Socail Assistance Services
9. Construction
10. School Education
Skilled కేటగరీ లో వచ్చిన వలసదారులు 92 శాతం ఆంగ్ల భాషలో ప్రావీణ్యత గలవారే.

ఆస్ట్రేలియాలో ఎక్కువమంది వలసదారులు మెల్బోర్న్ నగరానికి వచ్చి స్థిరపడుతున్నారు. రెండవ స్థానం సిడ్నీ నగరానిది. చాలామంది అంతర్జాతీయ వలసదారులు అనుకున్న నగరానికి చేరితే అక్కడే స్థిరపడి ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఆస్ట్రేలియాలో ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రం వలస వెళ్ళేవాళ్ళలో కూడా మెల్బోర్న్ నగరమే ఎక్కువగా గమ్యస్థానంగా ఉంటుంది. ప్రపంచంలో గత 15 ఏళ్లలో మెల్బోర్న్ నగరం నివసించడానికి అనువుగా వుండే నగరాలలో సుమారు 12 సార్లు మొదటి స్థానంలో ఉండడమే కారణం కావచ్చు. అయితే ఇప్పుడు స్థిరాస్తి కొనాలంటే గగనం అయిపొయింది. అయితే ప్రాధమిక సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉంచడానికి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు చాలా కృషి సలుపుతున్నాయనడంలో సందేహం లేదు.

Send a Comment

Your email address will not be published.