వాల్‌నట్స్ తింటే జీవితకాలం..

వాల్‌నట్స్ తింటే జీవితకాలం..

వాల్‌నట్స్ తింటే జీవితకాలం పెరుగుతుంది

కరోనా మహమ్మారి కాలం కావడంతో ఆరోగ్యం ఆవశ్యకతను అందరూ తెలుసుకున్నారు. రోగనిరోధకశక్తి అధికంగా ఉంటే మహమ్మారి మన దరిచేరదని ఇప్పటికే చాలా మంది నిపుణులు చెప్పారు. కేవలం నిపుణులు చెప్పడమే కాకుండా అనేక పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని తెలిపాయి.

ఇదే సమయంలో కొన్ని పరిశోధనలు మాత్రం రోజూ వాల్నట్స్ (ఆక్రోటు కాయ) రోజూ తినడం వలన మనకు వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని తెలిపాయి. సాక్ష్యాత్తు హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా చేసిన పరిశోధనలో ఇదే విషయం తేటతెల్లమైంది. వాల్నట్స్ వాడడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని అనేక మంది నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఆరోగ్యం కోసం వాల్నట్స్ మాత్రమే కాకుండా ఇంకా వేరే ఆహార పదార్థాలు కూడా తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వీటిని తరుచూ తీసుకోవడం వలన మన ఆయుష్షు కూడా పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా ఇవి తీసుకోవడం వలన మనం అనారోగ్యం పాలయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

హార్వర్డ్ శాస్త్రవేత్తలు పరిశోధించి చెప్పిన దాని ప్రకారం వాల్నట్స్ తీసుకోని వారితో పోలిస్తే వాల్నట్స్ తినే వారిలో మరణం సంభవించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా వాల్నట్స్ తీసుకునే వృద్ధులలో ఆయుష్షు పెరుగుతుందని వారు తెలిపారు.

ఈ హార్వర్డ్ అధ్యయనంతో వాల్నట్స్ తీసుకోవడం వలన ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయనే విషయం అర్థమైంది. కొంతమంది వాల్నట్స్ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చెబితే ఒకేసారి భారీ మొత్తంలో వాల్ నట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇలా ఒకేసారి తీసుకోవడం కన్నా తరుచూ వాల్నట్స్ తీసుకోవడం ఉత్తమం. ఇలా తరుచుగా వాల్నట్స్ తీసుకున్న వారి ఆయుష్షు పెరుగుతుందని హార్వర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.

వాల్నట్స్ తినని వారితో పోలిస్తే వారంలో ఐదు సార్లు వాల్నట్స్ తిన్నవారిలో 14 శాతం మరణాల ప్రమాదం తగ్గిందని పరిశోధనలో తేలింది. కార్డియోవాస్కులర్  వ్యాధుల వలన చనిపోయే ప్రమాదం 25 శాతానికి తగ్గుతుందని తెలిసింది. అంతే కాకుండా తరుచూవాల్నట్స్ తిన్న వారిలో దాదాపు 1.3 సంవత్సరాల ఆయుష్షు పెరిగినట్లు రుజువైంది.

వారానికి రెండు నుంచి నాలుగు సార్లు వాల్నట్స్ తిన్నవారిలో కూడా ఆయుష్షు పెరుగుతుందని పరిశోధనలో తేలింది. కానీ వీరిలో వారానికి ఐదుసార్లు వాల్నట్స్ తిన్నవారితో పోలిస్తే కాస్త తక్కువ ప్రయోజనం ఉంటుంది. వారానికి ఐదు సార్లు వాల్నట్స్ తిన్న వారిలో మరణించే ప్రమాదం 14 శాతం తగ్గగా.. వారానికి రెండు నుంచి నాలుగుసార్లు వాల్నట్స్ తీసుకున్న వారిలో మరణించే ప్రమాదం 13 శాతం తగ్గినట్లు పరిశోధనలో తేలింది. కార్డియోవాస్కులర్ వ్యాధుల వలన చనిపోయే ప్రమాదం 14 శాతానికి పడిపోతుందని పరిశోధనలో పేర్కొన్నారు. అంతే కాకుండా వాల్నట్స్ తినని వారితో పోలిస్తే వారానికి రెండు నుంచి నాలుగు సార్లు వాల్ నట్స్ తిన్న వారిలో దాదాపు ఒక సంవత్సరం ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

మనలో చాలా మందికి వేరే రకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి. అయినా కానీ వాటితో కలిపి వాల్నట్స్ తీసుకోవాలి. ఇలా వాల్నట్స్ ను తరుచూ తీసుకోవడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

హార్వర్డ్ శాస్త్రవేత్తలు పరిశోధనకు సంబంధించిన అన్ని వివరాలను శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ పరిశోధనకు కావాల్సిన డేటాను 67,014 మంది లేడీ నర్సుల నుంచి స్వీకరించారు. వారంతా యావరేజ్ గా 63.6 సంవత్సరాల వయసున్నట్లు సైంటిస్టులు పేర్కొన్నారు. అలాగే 26,326 ఆరోగ్యవంతులైన పురుషులను పరిశోధకులు పరిశీలించారు. వారి సగటు వయసు 63.3 సంవత్సరాలుగా ఉంది. ఇలా వీరిని 1998 నుంచి 2018 వరకు దాదాపు 20 సంవత్సరాల పాటు శాస్త్రవేత్తలు అబ్జర్వేషన్ లో ఉంచి పరిశీలించారు. అటు తర్వాతే పరిశోధనకు సంబంధించిన ఫలితాలను వెల్లడి చేశారు.

ఇలా వారిని అబ్జర్వేషన్ లో ఉంచిన 20 సంవత్సరాలలో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక సారి నిపుణుల వద్దకు వచ్చి వారు ఏం, ఏం ఆహారం తీసుకుంటున్నారో తెలిపాలని షరతు విధించారు. ఇలా వారు తీసుకునే ఆహార విధానాలను గురించి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ ఉన్నారు. వారిలో కొంత మంది వాల్నట్స్ తో పాటు వేరే రకాల గింజలను తీసుకోగా.. కొంత మంది ధూమపానం వంటి అలవాట్లను కలిగి ఉండేవారు.

ఇలా వారి నుంచి సేకరించిన డేటా ప్రకారం పరిశోధకులు వాల్నట్స్ వలన వారిలో కలుగుతున్న ప్రయోజనాలను గురించి ఈజీగా గుర్తించగలిగారు. ఇలా వారి శరీరంలో వాల్ నట్స్ వలన కలుగుతున్న ప్రయోజనాలను గుర్తించి నోట్ చేసుకున్నారు. అనంతరం పరిశోధన పూర్తయిన తర్వాత వాల్నట్స్ వలన కలిగే ప్రయోజనాలను గురించి విశదీకరించారు.

ఈ పరిశోధనలో పాల్గొన్న వారిలో కూడా కొంత మంది అధిక మొత్తంలో వాల్నట్స్ తీసుకుంటే, మరికొందరు మాత్రం చాలా తక్కువగా వాల్నట్స్ తీసుకున్నారు. ఇలా చేయడం వలన వాల్నట్స్ ను అధికంగా తీసుకునే వారిలో కలిగే అధిక ప్రయోజనాలను శాస్త్రవేత్తలు ఈజీగా గుర్తించగలిగారు.

వాల్నట్స్ ను అధిక మొత్తంలో తీసుకున్న వారు శారీరకంగా చాలా యాక్టివ్ గా ఉండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే సమయంలో తక్కువ మొత్తంలో వాల్ నట్స్ను తీసుకున్న వారు అంతగా యాక్టివ్గా లేరని శాస్త్రవేత్తలు తెలిపారు. కేవలం వాల్నట్స్ ను తీసుకోవడం మాత్రమే కాకుండా మధ్యపానం తీసుకోకుండా దూరంగా ఉండడం, ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండడం కూడా చాలా అవసరమని శాస్త్రవేత్తలు తెలిపారు.

Send a Comment

Your email address will not be published.