విశాల్‌ కొత్త సినిమా

ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో విశాల్‌ కొత్త సినిమా

నటుడు విశాల్‌ తమిళ దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథను కూడా ఓకే చేశాడట. బడ్జెట్‌ ఎక్కువగా ఉండటం చేత నిర్మాత ఎవరనే విషయంలో సందిగ్దంలో ఉన్నాడట దర్శకుడు. కానీ ఇప్పుడు నిర్మాత వినోద్‌ కుమార్‌ ముందుకు వచ్చాడని చెప్పుకుంటున్నారు. మలేషియాలో చిత్రీకరణ జరుపుతారు. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో ఆర్య నటించనున్నారు. విశాల్‌-ఆర్య గతంలో ‘వాడు-వీడు’లో కలిసి నటించారు. లాక్‌డౌన్‌ పూర్తి కాగానే సెట్స్‌పైకి తీసుకెళ్ళే యోచనలో ఉన్నట్లు సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. ఆనంద్‌ శంకర్‌ ఇప్పటికే ‘ఇరు మురుగన్‌’, ‘అరిమా నంబి’లాంటి చిత్రాలు తెరకెక్కించారు. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘నోటా’ చిత్రానికి ఆనంద్‌ శంకరే దర్శకత్వం వహించారు.

Send a Comment

Your email address will not be published.