వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ - హేల్డీ టిప్స్

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ లో ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం

lockdown

కరోనా అన్ లాక్ మొదలైనప్పటికీ పాజిటివ్ కేసులు భారీగా పెరుతున్న నేపథ్యంలో గత నాలుగైదు నెలల నుంచీ అనేక‌ కంపెనీలు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నాయి. దీంతో గంట‌ల త‌ర‌బ‌డి క‌ద‌ల‌కుండా ఒకే చోట కూర్చుని ప‌ని చేస్తున్నారు. పైగా పని అయిపోయేంత‌వ‌ర‌కు నోట్లో ఏదో ఒక‌టి వేసుకుని న‌ములుతూనే ఉంటారు. ఇది ఎంత అపాయ‌కర‌మో ఎవ‌రైనా ఆలోచించారా? ఎప్పుడూ తినేంత‌గానే తింటున్నాం.. అంత‌కుమించి ఒక్క ముద్ద ఎక్కువ‌గా తిన‌ట్లేదు అంటూ మీరు స‌మాధాన‌మిచ్చినా ప్ర‌మాదం పొంచే ఉంది. ఆ ప్ర‌మాదాన్ని నిలువ‌రించాలంటే మీరు కంప్యూట‌ర్ మీద ఎంత‌సేపు ప‌ని చేసినా శారీర‌క వ్యాయామం త‌ప్ప‌నిస‌రి.

ఆఫీసులో ఉంటే క‌నీసం 5-10 నిమిషాలైనా అటూ ఇటూ న‌డుస్తూ స‌హోద్యోగుల‌తో మాట్లాడుతారు. కానీ ఇప్పుడు కూర్చున్న చోటు నుంచి అంగుళం కూడా క‌ద‌ల‌‌ట్లేదు. ఇలాగే నిర్ల‌క్ష్యం చేస్తే అదిగో.. పై ఫొటోలో ఉన్న‌ట్లుగా మారిపోతారంటోది డైరెక్టీ అప్లై సంస్థ‌. ఫొటోలో క‌నిపిస్తున్న మోడ‌ల్‌కు ‘సుశాన్’ అని నామ‌క‌ర‌ణం చేసింది. ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే 25 సంవ‌త్స‌రాల వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ త‌ర్వాత‌ ఇలా మారిపోతారు అని హెచ్చ‌రిక‌లు జారీ చేస్తోంది.

ముఖ్యంగా కంప్యూట‌ర్ విజ‌న్ సిండ్రోమ్, ‌వెన్నెముక వంగిపోవ‌డం, రిపిటేటివ్ టైపింగ్ స్ట్రైన్‌, జుట్టు రాలిపోవడం, కంటి కింద మచ్చ‌లు (డార్క్ స‌ర్కిల్స్‌), టెక్ నెక్‌ (మెడ‌పై అధిక‌భారం, వెన్ను నొప్పి), ఇంక్రీజ్‌డ్ వ్రింకిల్స్‌ (చ‌ర్మంపై ముడ‌త‌లు), ఊబ‌కాయం, చ‌ర్మం పొడిబారి, నిర్జీవంగా మార‌డం ( విట‌మిన్ డీ, డీ-12 లోపం వ‌ల్ల‌), తీవ్ర ఒత్తిడి వంటి శారీరక మానసిక వ్యాధులు రావ‌డం త‌థ్య‌మ‌ని చెప్తోంది.

ఇప్పటికే వీటితో సతమతమౌతున్నవారు వీటిని నివారించేందుకు చిన్న‌పాటి వ‌ర్క‌వుట్లు, న‌డ‌క‌, ప‌రుగు, శారీర‌క శ్ర‌మను క‌లిగించే ప‌నులు చేయాల్సిందేనంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ప‌డ‌క‌పై ప‌ని చేసుకునే దుర‌ల‌వాటుకు ముగింపు ప‌ల‌కాలి. ఎందుకంటే ఇది మీలో గ‌జిబిజిని పెంచి క్ర‌మంగా ఒత్తిడిగా మారే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి ప్ర‌త్యేక డెస్క్ ఏర్పాటు చేసుకోవ‌డం ఉత్త‌మం. 6-8 గంట‌లు మాత్ర‌మే ప‌నికి కేటాయించండి. రోజులో క‌నీసం ఒక్క గంట అయినా ఫోన్ వంటి ఎల‌క్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు గుడ్‌బై చెప్పండి. ఆ స‌మ‌యాన్ని కుటుంబంతో క‌లిసి మాట్లాడేందుకు కేటాయించండి. ఇది మీకు ప్ర‌శాంత‌త‌ను చేకూరుస్తుంది. వీటితోపాటు ఎక్స‌ర్‌సైజులు త‌ప్ప‌నిస‌రి. ముఖ్యంగా ఉద‌యం పూట చేసే వ్యాయామం మీ శ‌రీరానికే కాకుండా మాన‌సికంగా కూడా ఎన్నో లాభాల‌ను తెచ్చిపెడుతుంది. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌ర్చ‌డంతోపాటు, మెద‌డును ఉత్తేజం చేస్తుంది. ముఖ్యంగా 7-8 గంట‌ల‌పాటు హాయిగా నిద్రించాలి.

ఇంట్లో ఉంటూ ఇవి చేయండి!
excercise

చిన్నవారి నుంచి పెద్దవారి వరకు, పేదల నుంచి సంపన్నుల వరుకు, సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరినీ ఇంటికే పరిమితమయ్యేలా చేసింది కరోనా మహమ్మారి. అయితే ఈ అవకాశాన్ని ‘మేం ఫిట్‌గా తయారవ్వాలి’ అని అనుకునే వారు చక్కగా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.

రోజూ వ్యాయామం చేసే అలవాటు ఉన్నవారు ఏ పార్క్‌కో, జిమ్‌కో, ఫిట్‌నెస్‌ సెంటర్‌కో వెళతారు అయితే ఇవేవి ప్రస్తుతం అందుబాటులో లేవు. అయితే ఇంట్లో ఉంటూనే వ్యాయామాలు చేస్తే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పెద్దవారు కనీసం రోజుకు అరగంటసేపు వ్యాయామం చేయాలని సూచించింది. ఒక గంటపాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉంటారని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతగా నిద్రపోవడానికి కూడా వ్యాయామాలు దోహద పడతాయని పేర్కొంది. కరోనా వైరస్‌ కారణంగా ఇంటి నుంచే పనిచేస్తున్న వారు మధ్యలో బ్రేక్‌ ఇస్తూ అప్పుడప్పుడు లేచి నిలుచోవాలని, బాడీని స్ట్రచ్‌ చేయాలని తెలిపింది. వర్క్‌ ఫ్రం హోం చేసేవారు సరైనా పద్దతిలో కూర్చోని పని చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఈ నేపథ్యంలో ఇంటివద్ద నుంచే వ్యాయామం చేయడానికి ఉన్న కొన్ని మార్గాలు
యూట్యూబ్‌, టీవీల్లో వ్యాయామ కార్యక్రమాలు చూడటం: ప్రస్తుతం టెక్నాలజీ విపరీతంగా పెరగడంతో ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. గూగుల్‌లో దొరికిన విషయం అంటూ ఉండదు. ఇక వ్యాయామానికి సంబంధించి అయితే యూ ట్యూబ్‌లో కుప్పలు తెప్పలుగా వీడియోలు ఉన్నాయి. మరీ ఇంట్లోనే ఉండి ఫిట్‌నెస్‌ పొందాలి అనుకునే వారు ఈ వీడియోలు చూస్తూ వ్యాయామం చేయవచ్చు. ప్రస్తుతం మనలో స్ఫూర్తి నింపడానికి చాలా మంది ఫిట్‌నెస్‌ ట్రైనర్‌లు కూడా అనేక వీడియోలను ఇప్పుడ షేర్‌ చేస్తన్నారు. ఎప్పటి నుంచో మీరు ఫిట్‌గా ఉండటానికి చేసే ప్రయత్నాలను వాయిదా వేస్తూ ఉంటే ఈ లాక్‌డౌన్‌ కాలాన్ని చక్కగా ఉపయోగించుకోండి.

కేలరీలను కరిగించుకోవడానికి మరో చక్కని మార్గం డాన్స్‌ చేయడం. ఇంట్లో ఉంటూనే మీకు ఇష్టమైన పాటలు పెట్టుకుంటూ డాన్స్‌ చేయండి. దీని వల్ల మీకు ఆనందంతో పాటు మీ శరీరంలో ఉండే కొవ్వు కూడా కరుగుతుంది. మానసిక ఉల్లాసంతో పాటు ఫిట్‌నెస్‌ లభిస్తుంది.

ఆటలు శరీరానికి మంచి వ్యాయామం. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో బయట తిరగలేం కాబట్టి యాక్టివ్‌ వీడియో గేమ్స్‌ ఆడుకుంటూ మనల్ని మనం యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఇలాంటి ఆడటం వల్ల ఫిజికల్‌ యాక్టివిటి జరుగుతుంది. దీంతో కేలరీలు కూడా కరుగుతాయి. మీరు మీకిష్టమైన ఆటలాడుతూ వ్యాయామం కూడా ఒకేసారి చేయవచ్చు.

ఇంట్లోనే ఉంటూ ఒక తాడుతో వ్యాయామం చెయ్యొచ్చు. స్కిప్పింగ్‌ రోప్‌తో ఎగురుతూ మీ ఇంటి టెర్రస్‌ పైనే వ్యాయామాన్ని చక్కగా పూర్తిచేయవచ్చు. అలాగే స్కిప్పింగ్‌ చేయడం వల్ల చాలా ఎక్కువ కేలరీలు ఖర్చుఅవుతాయి. ఇంట్లో ఉండి చేసే వ్యాయామాల్లో స్కిప్పింగ్‌ రోప్‌ను బెస్ట్‌ అని చెప్పవచ్చు.

ఇంట్లో మీకు అందుబాటులో ఉండే వస్తువులతోనే మజిల్‌ స్ట్రన్త్‌ ఎక్సర్‌ సైజ్‌లు చేయడం ఉత్తమం. దీనివల్ల మీరు చాలా ఫిట్‌గా తయారవుతారు. ఇలాంటి వ్యాయామాలతోపాటు మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. లాక్‌డౌన్‌లో ఉన్న ఈ 21 రోజుల కాలాన్ని మీ ఫిట్ నెస్‌ కోసం చక్కగా వినియోగించుకోండి. ఇంటి నుంచి బయటకు రాకుండా బాధ్యతయుత పౌరులు అనిపించుకోండి.

Send a Comment

Your email address will not be published.