శ్రీకృష్ణ జీమెయిల్‌.కామ్

భావన హీరోయిన్ గా శ్రీకృష్ణ జీమెయిల్‌.కామ్‌ సినిమా

కన్నడ నటుడు డార్లింగ్‌ కృష్ణ నటిస్తున్న చిత్రం ‘శ్రీకృష్ణ జీమెయిల్‌.కామ్‌’. నాగశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి భావన ప్రధాన కథానాయికగా నటిస్తోంది. ‘లవ్‌ మోక్‌టైల్‌’ హీరో కృష్ణ – భావన తొలిసారిగా కలిసి నటిస్తున్నారు. దర్శకుడు నాగశేఖర్‌ మాట్లాడుతూ..‘‘నేను గతంలో తీసన చిత్రాలకు కంటే భిన్నమైన కథాంశఃతో వస్తోంది ఈ సినిమా. ఇది కృష్ణకి మంచి పాత్ర అవుతోంది. అంతేకాదు చిత్రంలో కథానాయికది విలక్షణమైన పాత్ర అవుతోంది. ఈ పాత్రకు భావన సరిగ్గా సరిపోతుందని భావించి తీసుకున్నాం అని…’’ చెప్పారు. ప్రస్తుతం భావన శివకుమార్‌ నటిస్తోన్న ‘భజరంగీ 2’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. కరోనా వైరస్‌ పరిస్థితులు అనుగుణంగా చక్కబడితే వచ్చే నెల్లో నుంచి చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. సందేశ్‌ నాగరాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో దత్తన్న సుహాసిని, అరుణ్‌ సాగర్‌, రంగయన రఘులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి ప్రీతమ్‌ గుబ్బి డైలాగ్స్, సత్య హెగ్డే ఫోటోగ్రఫీ, జాస్సీ గిప్ట్ సంగీత స్వరాలు సమకూర్చనున్నారు. ఇక మరోవైపు దర్శకుడు నాగశేఖర్‌ తెలుగులో కన్నడలో విజయవంతమైన ‘లవ్‌ మాక్‌ టైల్‌’ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో సత్యదేవ్, తమన్నా జోడీగా నటించబోతున్నారు. భావన రవి మరో నిర్మాత. సెప్టెంబర్‌లో చిత్రీకరణ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దర్శకనిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కీరవాణి తనయుడు కాలభైరవ స్వరాలు సమకూరుస్తున్నారు. సత్య హెగ్డే ఛాయగ్రాహకుడుగా వ్యవహరిస్తారు. మరి నాగశేఖర్‌ ఈ రెండు చిత్రాలను ఎలా చేస్తారో వేచి చూడాలి.

Send a Comment

Your email address will not be published.