శ్రీశాంత్ ప్రేమకథ

శ్రీశాంత్ ప్రేమకథ

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఓ తెలుగు సినిమాలో నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.
హైదరాబాద్ లో శ్రీశాంత్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు.

ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు శానా యాదిరెడ్డి అని శ్రీశాంత్ చెప్పాడు. ఈ చిత్రాన్ని మూడు దక్షిణాది భాషల్లో నిర్మిస్తున్నారని, అవి తెలుగు, తమిళం, మళయాలం అని ఆయన తెలిపాడు.

ఇదొక క్రికెటర్ ప్రేమ కథ అని శ్రీశాంత్ చెప్పారు. ఈ సినిమా తనకో పెద్ద సవాల్ అని, ఈ సినిమా చేయడానికి తానూ ఎంతో ఉత్సుకతతో ఉన్నానని చెప్పారు. అయితే ఈ సినిమా కథ పూర్తిగా తన జీవిత కథనం కాదని, కానీ కొన్ని పోలికలు ఉన్నాయని తెలిపాడు.

ప్రస్తుతం యాక్టింగ్ లో శిక్షణ పొందుతున్న శ్రీశాంత్ పూజా భట్ తో కలిసి తర్ఫీదు పొందుతున్నట్టు చెప్పాడు.

ఈ సినిమా కోసం తానూ కొంత హోం వర్క్ కూడా చేస్తున్నానని చెప్పాడు.
అయితే ఈ సినిమా విరాట్ కోహ్లి, అనుష్కాల ప్రేమ కథా అని అడగ్గా కాదని శ్రీశాంత్ జవాబిచ్చాడు. ఈ ప్రేమ కధ ఎవరిదైనా కావచ్చని విరాట్ లేదా యువరాజ్ లేదా రవి శాస్త్రి సార్ ఇలా ఎవరి కథైనా కావచ్చు అని చెప్పాడు. ఈ కథాంశం క్రికెట్ తో ముడిపడినప్పటికీ పూర్తిగా క్రికెట్ కథ కాదని అన్నాడు.

Send a Comment

Your email address will not be published.