మాస్ సినిమాల కథానాయకుడు రవితేజ తాజా చిత్రం ‘క్రాక్’. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రుతిహాసన్ నటిస్తోంది. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై బి.మధు నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో వరలక్ష్మి, సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు. ఈ వేసవిలోనే సందడి చేయాల్సి ఉన్నా లాక్డౌన్కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ఇటీవలే పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. ఒకపాట చిత్రీకరణ మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని చిత్ర బృందం తెలిపింది. 2021 సంక్రాంతి కానకగా థియేటర్లలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమాకు తమన్ సంగీత స్వరాలు సమకూర్చారు.
సంక్రాంతికి వస్తున్న‘క్రాక్’
