సినిమాకి సిద్ధమే

సినిమాకి సిద్ధమే

మంచి కథతో ఏ దర్శకుడు వచ్చినా తాను నటించడానికి సిద్ధమే అని మెగా స్టార్ చిరంజీవి ప్రకటించారు. కథ విషయంలోనే ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని, చర్చలు సాగుతున్నాయని ఆయన అన్నారు.

మేనల్లుడు సాయి ధరం తేజ్, రేజీనా జంటగా నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం పాటల విడుదల ఆగస్ట్ 23వ తేదీన హైదరాబాదులో ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. పాటల సీడీని ఆవిష్కరించి ప్రముఖులకు ఇచ్చారు.

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా కథ వింటున్నప్పుడు ఈ టైటిల్ చూస్తుంటే తానూ నటించి సూపర్ డూపర్ హిట్టైన మొగుడు కావాలిం బావగారూ బాగున్నారా సినిమాలు గుర్తుకు వచ్చాయని చిరు చెప్పారు. సాయి నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కూడా విజయవంతమవుతుందని ఆయన అన్నారు. ఈ చిత్రంలో రేజీనా తన వొంపు సొంపులతో బాగా నటించిందని చెప్పారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఈ చిత్రానికి దిల్ రాజ్ నిర్మాత కావడం విశేషమని తెలిపారు. కేవలం డబ్బు పెట్టడమే కాకుండా అన్ని శాఖలపైనా పట్టున్న నిర్మాత దిల్ రాజ్ అని చిరు కొనియాడారు. హరీష్ శంకర్,తమ్ముడు పవన్ కళ్యాన్ కాంబి నేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాకు తాను గొప్ప అభిమానినని, తనకు అలాంటి సినిమా కావాలని అనుకునే వాడినని అన్నారు. సాయి ధరం తేజ్ ఈ రంగంలో నిలదొక్కు కోవాలంటే కృషి ప్రధానమని సూచించారు.

సాయి ధరం తేజ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి మావయ్య (చిరంజీవి) రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. నటుడిగా బొమ్మరిల్లు సంస్థ జన్మనిస్తే దిల్ రాజ్ సంస్థ తనను చేయి పట్టుకుని నడిపిస్తోందని, దర్శకుడు హరీష్ శంకర్ అన్నయ్య తనకు అండగా ఉన్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో దిల్ రాజ్, హరీష్ శంకర్ తదితరులు మాట్లాడారు.

Send a Comment

Your email address will not be published.