సుందరమైన అమెరికా - అందుకో నా వందనం!

సుందరమైన అమెరికా - అందుకో నా వందనం!

అందాల అంబరాన వెల్లి విరిసిన ఏడురంగుల హరివిల్లు చందం. అద్భుత నయనానందం, ప్రకృతి కాంత పరువంపు ఒంపుల హొయలన్ని పుణికి పుచ్చుకున్నవిచిత్ర వైనాలు. విధాత సృష్టికే మకు టాయ మానాలు. ఎటు జూచిన హరిత వర్ణాలు , బాట లకిరువంకల పలు వర్ణాల ఫల, పుష్ప పత్రాల తరులతలన్ని రవిరాజు కిరణాల తటిల్లతలై మెరసి చూపరుల మరపిమ్పజేయు,||అమెరికా|| అడుగడుగునా మడుగులు, అంతలో గల గలా పారే జలాశ యములు , సు విశాల బాటలపై సర్ ఫర్ మని పరుగు లిడు చిన్న పెద్ద వాహన ధ్వనులు, ఆనీలాల నింగిని ఎడతెరిపి లేక సాగు విమాన యాన రొదలు,||అమెరికా|| సంధ్యా సమయాన హాయిగా ఎగిరి గూటికి చేరు విహంగ విన్యాస ,కిల ,కిలా రావములు, వీనుల విందై నాయనానందమగు, ప్రకృతి రమణీయసొగసులు నింగిని తాకు ఆకాశ హర్మ్యాల విద్ద్యు ద్దీప కాంతులు తారాతోర ణ ములై నల్లని నిశీధిని చేధించు వెలుగుల ప్రసరింప పున్నమి రేడు పుడమికి దిగేనా ?అనిపించు, మానవనిర్మిత మాయాజాలములు , ఎన్నో మరెన్నోప్రకృతిసిద్ధ సుందర పర్యాటక స్థలముల వింత వింత సోయగాల ,అమెరికా అందాలు అవనికే కలికి తురాయిలు ||అమెరికా || ఉరుకుల పరుగుల ఉత్తుంగ జల తరంగిణి తటిల్లతలై కాంతులీనుచు చీకటిని వెలిగించు, వర్ణ విద్ద్యుద్కాన్తుల మెరసి పర్యాటకుల మైమరపించు, “నయాగరా జలపాతం”, అమెరికా వయ్యారి హొయలు చూపించు ఎల్లిస్ ఐ లాండ్ శిల్ప సుందరి ఒకచేత మార్గనిర్దెశిక దివ్యజ్యోతి, ఇంకొక చేత న్యాయ నిర్ణేత గ్రంధముతో, “స్టాట్యూ ఆఫ్ లిబెర్టి “శిల్పసుందరి వంటి సుందర శిల్ప రాజము లెన్నో ఎన్నెన్నో,||అమెరికా|| సుగంధపరిమళ భరిత సుందరవర్ణముల మేలు జాతుల గులాబి తోటలు “లాంగ్ వుడ్ గార్డెన్స్ ” ఫిలడెల్ఫియా తావులనే పరిమ ళిం పజేయు,॥ అమెరికా॥ ప్రపంచమునె ఉర్రుతలూ గించు “హాలివుడ్ సినీ పరిశ్రమ, అమెరికా అద్యక్ష వాసం ,మచ్చలేని శ్వేత సౌధం, “లిన్కన్మెమొరియల్ ” వాషింగ్టన్ .డి.సి . ||అమెరికా|| ఎర్రని ఎత్తైన గిరులు పచ్చని వృక్షములు అట్టడుగు అగాధమంటి లోయలు, జలాశయముల భయ, ఆశ్చర్య ఆనందముల గూర్చు ఆరిజోనా గ్రాండ్ కానన్ “, జాతీయ ఉద్యానం , పిన్న పెద్దల స్వప్న సీమగా కను విందు సేయు,”డిస్నీలాండ్” ఎన్నెన్నో వైచిత్ర్యాలు ఏ బది రాష్త్రముల , ప్రతి రాష్ట్రమున ఎన్నో ఎన్నెన్నో వింత, వింత, విచిత్ర మానవ నిర్మిత మాయాజాలములు, ప్రకృతిసిద్ధ సుందర పర్యాటక స్థలముల పొందు పరచుకున్న, అమెరికా అందాలు, సందర్సుల పాలిటి స్వర్గధామాలు, స్ప్రింగ్ లోన ప్రకృతి పరవశించి పాడు కుహు , కుహు గానాల మధుర గీతికి , పురి విప్పి ఆడు మయూరమై తోచు , అమెరికా అందాలు అవనికే అలంకారములు,||అమె రికా|| ఆర్ధిక వనరులకై కన్నవారిని , ఆంధ్రమాతను వీడి అమెరికాచేరి ఆవేదన చెందు వారి వెలితిని పూడ్చి ఆహ్లాదము కూర్చు తెలుగు మహాసభలు నిర్వహించుచు ఆపన్నుల నాదుకొ ను తాన, నాట్స్ ,టి ఎల్ సి .ఎ.తెలుగుజ్యోతి ,వంటి ప్రముఖ తెలుగు సంఘములు ఆవిర్భవింఛి సేయు సేవలతో భారతావని సంస్కృతీ సరిగమల కీర్తి పతాక అమెరికాగగనవీదుల వీవసాగే ॥ అమెరికా ॥ ——————————————————— కామేశ్వరి సాంబమూర్తి.భమిడిపాటి. పి.ఏ. యు. ఎస్. ఏ.

Send a Comment

Your email address will not be published.