‘సైరా’లో ఝాన్సీగా అనుష్క

Sye -Raaరాయలసీమ పాలెగాడు బ్రిటీష్‌ వారిని ఎదురించిన విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా వస్తున్న చిత్రం ‘సైరా’. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క శెట్టి కీలక పాత్రలో నటిస్తుంది. ఇందులో ఆమె భారతీయ వీరనారి ఝాన్సీలక్ష్మిగా చేస్తుందని సినీ వర్గాల సమాచారం. ఇప్పటికే అనుష్క ‘రుద్రమదేవి’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు. బాలీవుడ్‌ నుంచి అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తుండగా దక్షిణాది నుంచి విజయ్‌సేతుపతి, కిచ్చా సుదీప్‌లు నటిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయిక. సినిమా చాలా వరకు షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

Send a Comment

Your email address will not be published.