సైరాలో ’తమన్నా‘ భరతనాట్యం

tamana2మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా ’సైరా‘లో తమన్నా భరత నాట్యం చేయనుంది. కొణిదెల ప్రొడక్షన్స్‌పై మెగా పవర్‌స్టార్‌ రాంచరణ్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం సైరా. స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్నారు. మెగాస్టార్‌ రేంజ్‌కు తగ్గట్టు ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి. ఇటీవలే మొదటి షెడ్యుల్‌ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్‌ త్వరలో రెండో షెడ్యుల్‌ మొదలుపెట్టబోతోందని తెలుస్తోంది.

చిరంజీవికి జోడిగా నయనతార నటిస్తున్నారు. కాగా ఓ కీలకపాత్రకు మిల్కీబ్యూటీ తమన్నాను తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర కోసం తమన్నా ప్రస్తుతం భరతనాట్యం నేర్చుకుంటున్నట్లు సమాచారం. బాహుబలి తర్వాత తెలుగులో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

Send a Comment

Your email address will not be published.