సోలో బ్రతుకే సో బెటర్

సోలో బ్రతుకే సో బెటర్

సోలో బ్రతుకే సో బెటర్..త్వరలో!

వేసవిలోనే విడుదల కావాల్సిన కొన్ని చిత్రాల ప్రణాళికలు లాక్‌డౌన్‌ కారణంగా తారుమారయ్యాయి. కొందరు దర్శకనిర్మాతలు సమయం వెచ్చించలేక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ వేదికగా తమ చిత్రాల్ని విడుదల చేయగా.. మరికొందరు థియేటర్లోనే చేయాలని నిశ్చయించుకున్నారు. ఇంకొందరు సందిగ్థంలోనే ఉన్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ చిత్రం విషయంలో ఇదే సందేహం కలిగింది అభిమానులకు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు ప్రారంభం కావడంతో థియేటర్లోనే వస్తుందంటూ ఓ వైపు.. ఓటీటీలోనే చేస్తారంటూ మరోవైపు వార్తలొచ్చాయి. తాజాగా ఈ చిత్ర సెన్సార్‌ పూర్తయింది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌.. ఈ సినిమాకు క్లీన్‌ యు సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడిస్తూ ‘అతి త్వరలో మీ ముందుకు’ అని ట్వీట్‌ చేశాడు కథానాయకుడు సాయి తేజ్‌. అయితే అది ఓటీటీలోనా, థియేటరా? స్పష్టత ఇవ్వలేదు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుబ్బు దర్శకుడు. సాయి తేజ్‌ సరసన నభా నటేష్‌ నటించింది. తమన్‌ సంగీతం అందించారు.

Send a Comment

Your email address will not be published.