స్థానికులే పాత్రధారులు, సూత్రధారులు

31.1
Untitled-1Untitled-31
క్వీన్స్ ల్యాండ్ తెలుగు సంఘం దసరా దీపావళి
మన కళలను మనం పోషించి స్థానికులను ప్రోత్సహించి భారతదేశం నుండి ప్రత్యేక అతిధి లేకుండా సుహృద్భావ వాతావరణంలో ఒక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం ఒక సాహసమే. ఎవరో ఒక ప్రముఖ వ్యక్తి లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే ఎవరూ రారన్నది ఒక అపూహేనని నిరూపించారు క్వీన్స్ ల్యాండ్ తెలుగు సంఘం వారు. నాణ్యత గల కార్యక్రమాలు నిర్వహిస్తే అందరూ ఆదరిస్తారన్నది నిర్వివాదాంశం. పిల్లలు, పెద్దలు మరియు ఇతర స్థానిక సంస్థల ప్రోద్బలంతో నిర్వహించిన కార్యక్రమం అత్యంత ఆహ్లాదంగా సాగటం ఎంతో ముదావహం. ప్రేక్షకులందరూ మంత్రముగ్డులై కార్యవర్గ సభ్యులందరినీ అభినందించి ఇక ముందు కూడా ఇలాగే కార్యక్రమాలు జరిగాలని ఆకాంక్షించారు.

ప్రతీ సంవత్సరం ఎవరో ప్రముఖ వ్యక్తీ భారతదేశం నుండి రావడం ఆనవాయితీ. ఈ సాంప్రదాయానికి తోసిరాజని ఈ ప్రత్యెక కార్యక్రమానికి స్థానికులే పాత్రదారులు, సూత్రదారులుగా కార్యోన్ముఖులై దిగ్విజయంగా దసరా దీపావళి పండగను ఘనంగా నిర్వహించారు. మనల్ని మనం గౌరవించుకోవటం అన్న ఆశయంతో ముందుకెళ్తున్న ప్రస్తుత క్వీన్స్ ల్యాండ్ తెలుగు సంఘం కార్యవర్గం ప్రేక్షుకులే ముఖ్య అతిధులు అంటున్నారు.

ఈశ్వరాలయ కళైకూడం మరియూ నటేశ్వరకళ నృత్య కళాశాల వారి సాంస్కృతిక నృత్యాలు, చలన చిత్ర నృత్యాలు, బాల సంస్కార కేంద్రం వారి కృష్ణుడి నాటకము, వైయోలిన్, కీ బొర్డ్ వాయిద్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆనంద లోకాల్లో విహరింప చేసాయి.
36.5
Untitled-41 Untitled-21
 
కాలంవేల్ కౌన్సిలర్ శ్రీ ఏంజెల ఒవెన్ ముఖ్య అతిధులుగా విచ్చేసారు. వారు జ్యోతి ప్రజ్వలన చేయుటకు క్వీన్స్ లాండ్ తెలుగు సమితి వ్యస్థాపక అధ్యక్షులు శ్రీ ప్రకాష్ నల్లమల్లి గారు సహకరించారు. గౌరవ కౌన్సిలర్ శ్రీ ఏంజెల ఒవెన్ ప్రసంగిస్తూ, దీపావళి వెలుగుల పండుగ అని అలాగే చెడుపై మంచి విజము సాధించిన వేళయని చెప్పారు. క్వీన్స్ లాండ్ తెలుగు సమితి వారు చేయుచున్న కార్యక్రమాలు ఆదర్శవంతముగా నున్నవని, ఆస్ట్రేలియా లో నివసించు మన భావి తరాల తెలుగు పిల్లలకు మన భాషని మరియూ సంస్కృతిని నేర్పించే విధంగా ఉన్నాయని కొనియాడారు. బహుళ సంస్కృతీ సాంప్రదాయాల సమాహారమైన ఆస్ట్రేలియా వంటి జాతికి, ఇటువంటి కార్యక్రమాలు  వెన్నెముకగా నిలుస్తాయని అభివర్ణించారు. గౌరవనీయులు, బ్రిస్బేన్ నగర లార్డ్ మేయర్ ఐన గ్రాహం క్విర్క్ గారి అభినందనలు తెలియజేసారు.

మొదటి సారిగా క్వీన్స్ లాండ్ తెలుగు సమితి స్వచ్ఛంద సేవలు కోరుచూ దరఖాస్తులు కోరారు. ఈ ఆహ్వానానికి స్పందించి, తమ విలువైన సమయాన్ని కేటాయించి, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషించిన స్వచ్ఛంద కార్యకర్తలకు తెలుగు సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Untitled-71
100 (1)
చిన్నారులు ప్రదర్శించిన ‘దశావతారము’ అను నాటకమునకు ప్రేక్షకులు నిలబడి కరతాళ ధ్వనులు చేసారు. ప్రతీ ఒక్క చిన్నారి తలిదండ్రులకు నాటక గురువులకూ కృతజ్ఞతాభినందనలు తెలియజేసారు తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీమతి నవనీత తాటిమాకుల గారు.

విశ్వ హిందూ పరిషద్ వారి బాల సంస్కార కేంద్రం నుండి కూడా ఇద్దరు స్వచ్ఛంద సేవలు అందించడానికి ముందుకు వచ్చారు. వారికి ధన్యవాధములు తెలుపుకున్నారు.

ప్రేక్షకులు గెలుచుకున్న అంతర్జాతీయ యాషెస్ సిరీస్ క్రికెట్ టిక్కెట్లు అందించిన శైలజ ఆర్థం వారికి కృతఙ్ఞతలు తెలిపారు. ఉత్తమ వస్త్రాలంకరణ పోటీలో గెలుపొందిన జంటకు మరియు పాపకు శుభాభినందనలు తెలిపారు.

గత మాసంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ (GC2018 XX1) ప్రచార ప్రారంభ వేడుకల్లో క్వీన్స్ లాండ్ తెలుగు సమితి తరపున శ్రీమతి రత్న గారు మరియు శ్రీమతి ఉమ గారు ప్రాతినిధ్యం వహించి, ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. వారికి అభినందనలు తెలియజేసారు. ఈ క్రీడల్లో మనమంతా ఒక్కటై, మన భారత దేశ క్రీడాకారులను ఉత్సాహ పరచి, ప్రోత్సహించాలని ఆశిస్తున్నట్లు శ్రీమతి నవనీత గారు చెప్పారు.

సింప్లీ హ్యుమన్ – హీరోస్ వితౌట్ కేప్స్ తరపున, శ్రీ ప్రేరణ పహ్వా గారు తమ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు గురించి తెలియజేసారు. గత దసరా వేడుకలకు ఇదే సత్కార్యములో తెలుగు ప్రజలు కనబరచిన ఉదాత్తతను, భూరీ విరాళాలను ప్రశంసించి, తమ ధన్యవాదాలు తెలియయజేసారు. అటువంటి సహృదయముతో మళ్ళీ విరాళములు ఇవ్వమని అభ్యర్ధించారు. శ్రీ ప్రేరణ పహ్వా గారికి తెలుగు సంఘం సహాయము ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేయడం జరిగింది.

ఇటువంటి మహత్కార్యము ఇంత భారీ ఎత్తులో విజయవంతమైనది మాత్రము ఆర్ధిక సహాయం అందించిన సంస్థల వలనేనని వేరే చెప్పనక్కరలేదు. వారందరికీ పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదములు.
54
Untitled-61
PLATINUM SPONSORS
Boss Aus Group, Mahesh Reddy garu, MR. Accountants
Neighbourhood Tax Agents & Accountants

GOLD SPONSORS
YUPP TV

SILVER SPONSORS
Dr. Gupta Kandula garu (Bridgeman Family Practice), Dr. Balaji Motamarri garu,
Q Kidneys Pty Ltd

BRONZE SPONSORS
Mr. Balaji Kadiyala garu, Mr. Ram Junnuri garu, United Petroleum, AUSXCHANGE,
7 Eleven (Victoria Point & Ormeau)

అదే విధంగా ఈ వేడుకలకు రుచికరమైన, శుచికరమైన విందు భోజనాన్ని అందించిన విందు పోషకులకు హృదయ పూర్వక కృతఙ్ఞతలు కార్యవర్గం తెలియజేసింది.
Balti, Top In Town, Southern Spice, Dosa Hut, Curry Heaven, Hyderabad Flavours, Mrs. Harika Koneru garu, Mr. Prabhakar Bachu garu

ఎల్లప్పుడూ సభ్యులందరూ సహాయ సహకారాలు తెలుగు సంఘానికి అందించాలని కోరుకుంటున్నట్లు తెలుగు సంఘం కార్యవర్గం మనవి చేసుకున్నారు.

Send a Comment

Your email address will not be published.