నటుడు కళ్యాణ్ రామ్ తన కోరికకు అనుగుణంగా ఒక నటుడిగా ఎదగడంతో పాటు ఎన్టీఆర్ అర్ర్త్స్ అనే బ్యానర్ తో ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి తనను తానుగా అభిమానకు వెండితెర మూలంగా చేరువ అవుతున్నఅయిన సంగతి తెలిసిందే కదా?
అయితే నందమూరి కళ్యాణ్ రామ్ చాలాకాలంగా ఒక మంచి సినిమాలో నటించడమే కాకుండా అది హిట్టుకొట్టాలని ఆశిస్తున్నారు.
హిట్టు అనేది ఎవరి చుట్టమూ కాదని, జయాపజయాలు అనేవి ప్రతీ నటీనటులకు ఎదురవుతుంటూ ఉంటాయని కళ్యాణ్ రామ్ అన్నారు. అన్ని అంశాలూ చక్కగా అమరి అదృష్టం కలసి వస్తే సినిమా హిట్టవడం పెద్ద కష్టమేమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధంగానే ఆయన ఎప్పుడైనా అపజయాన్ని చవిచూసినా అందుకు బాధపడి క్రుంగి పోకుండా ముందుకు పోవడం ప్రధానమని చెప్పుకుని అలాగే నడచుకుంటారు. అప్పుడు జరిగిన లోటుపాట్లు తెలుసుకుని వాటిని అధిగమించడానికి ఆయన కృషి చేస్తారు.
కళ్యాణ్ రామ్ తాజాగా నటించి నిర్మిస్తున్న చిత్రం పటాస్. ఈ చిత్రంలో ఆయన ఒక పవర్ఫుల్ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగు శరవేగంతో సాగుతోంది. ఈ చిత్రంలో ఒక రీమిక్స్ చేస్తున్నారు. ఆయన బాబాయి బాలకృష్ణ గతంలో నటించిన రౌడీ ఇన్ స్పెక్టర్ చిత్రంలోని అరెహో సాంబా అనే పల్లవితో హిట్టైన ఒక పాటను ఇప్పుడు కళ్యాణ్ రామ్ తన పటాస్ చిత్రంలో రీమిక్స్ చేస్తున్నారు.