హిట్లర్ మాట్లాడితే ఆవలింతలు

హిట్లర్  మాట్లాడితే  ఆవలింతలు

నియంత హిట్లర్ తొలి రోజుల జీవితంపై ఇయాన్అనే ఆయన ఓ పెద్ద పుస్తకమే రాసారు. అందులో ఉన్న కొన్ని విషయాలు….

నాజీల సమావేశం ఒకటి 1919 లో జరిగింది. ఆ సమావేశంలో హిట్లర్ మొదటిసారిగా వేదిక ఎక్కి ప్రసంగించాడు. ఆ సమావేశానికి వచ్చిన వారు వందమంది. ఆయన మాటల సామర్ధ్యాన్ని తెలుసుకున్న తర్వాత నాలుగు నెలలకు ఓ సమావేశం జరిగినప్పుడు రెండు వేల మంది వచ్చారు. ఆ తర్వాత నాలుగేళ్ళలో ఆయన సొంతంగా ఒక పత్రిక ఆరంభించారు. 55 వేల మంది చందా కట్టి నాజీ పార్టీ కార్యకర్తలయ్యారు.

వేదిక ఎక్కగానే మాటలు మొదలుపెట్టి అట్టహాసం చేయడం హిట్లర్ కి అలవాటు. ఆయన ఓ సారి మాట్లాడటం ముగించినప్పుడు వేదిక బరువు అయిదు పౌండ్ల వరకు తగ్గినట్టు లెక్కేశారు. ఆయన ఇరవై బాటిళ్ళ మినరల్ వాటర్ తాగేరట.

ప్రభుత్వ ఫైళ్లు పరిశీలించడంలో హిట్లర్ మహా బద్ధకస్తుడు. చాలా మంది మంత్రులు తమ విభాగాల విషయాలు చెప్పి వాటికి సంబంధించిన విషయాలను ఆయన నోటంట విని వాటినే ఉత్తర్వులుగా పొందేవారు. పగలు మూడు గంటల వరకు నిద్రపోయి భోజనం ముగించి తోటలో షికారు చేసి ఆ పైన ఓ సినిమా చూసిన తర్వాత ప్రభుత్వపనులు చూడటం మొదలుపెట్టేవాడు హిట్లర్.

వాగుడులో నెంబర్ వన్ హిట్లర్. ఆయన మాట్లాడటం మొదలు పెట్టడంతోనే మంత్రులు గడియారం వంక చూసుకునే వారు ఎప్పుడు ఆపుతాడా అని. అలాగే చాలా మంది మంత్రులు ఆవలింతలు వచ్చి వాటిని ఆపుకోవడానికి నానా తంటాలు పడేవారట హిట్లర్ తిడతాడేమో అనే భయంతో.

—యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.