హీరో కాకుండానే క్రేజ్

ఇంకా అతను హీరో కూడా కాలేదు. కానీ అంతలోనే అతనంటే రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతోంది.

అక్కినేని వంశానికి చెందిన మూడు తరాలవారు (నాగేశ్వర రావు, నాగార్జున, నాగచైతన్య) కలిసి నటించిన మనం  సినిమాలో నాగార్జున రెండో  కుమారుడు అఖిల్ అతిధి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. మనం లో కాసేపే కనిపించిన అఖిల్ హీరోగా ఫుల్ లెంగ్త్ పాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో అని విమర్శకులు, అభిమానులు అంచనాలు వేస్తున్నారు.

అఖిల్ తెరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైంది. అయితే అఖిల్ ఎవరి దర్శకత్వంలో ఎటువంటి కథానాయకుడి పాత్రలో ప్రేక్షకుల ముందుకు వస్తారో అని ఆలోచిస్తున్నారు. అతను నటించబోయే చిత్రం కథ ఎలాంటిది ఉంటుందో అని ఊహాగానాలు చేస్తున్నారు.

అఖిల్ నటించబోయే చిత్రం విశేషాలు త్వరలోనే వెల్లడి కాబోతున్నాయి. ఈ విషయాన్ని అఖిల్ స్వయంగా చెప్పాడు. ఒక లైలా కోసం సినిమా సక్సస్ మీట్ లో చెప్తానని అతను ఆమధ్య అన్నాడు.

ఇలా ఉండగా  ఒక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా అఖిల్ ఇటీవల  ఒక యాడ్ కూడా చేసాడు.  ఈ యాడ్ కు మంచి స్పందనే లభించింది  కూడా.

తనపై ఇప్పటికే  ఇంతగా  ప్రేమాభిమానాలు చూపిస్తున్నందుకు అఖిల్ “లవ్ యు ఆల్ ” అంటూ ట్వీట్ చేసాడు కూడా.

Send a Comment

Your email address will not be published.