హృతిక్ రోషన్ శ్రీమంతుడు

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు విజయవంతమవడంతో హిందీలో ఈ చిత్రం రీమేక్ కోసం రచయిత, దర్శకుడు కోరట్ల శివ ఆసక్తి చూపుతున్నారు. మొదట్లో ఈ సినిమాకి వరుణ్ దావన్ ని అనుకున్నారు. అతనిని సంప్రదించారు కూడా. కానీ వరుణ్ దావన్ తండ్రి డేవిడ్ ధావన్ అందుకు అంగీకరించలేదు. తన కొడుకు చిన్నవాడని, మహేష్ బాబు పాత్రకు హిందీలో తగు న్యాయం చేస్తాడనుకోవడం లేదని అనడంతో ఆ వెంటనే మరో నిర్మాతతో సల్మాన్ ఖాన్ ని ఆలోచించారు. కానీ ఇప్పుడు హిందీలో మహేష్ బాబు స్థానంలో హృతిక్ రోషన్ తో ఒపందం కుదుర్చుకోవాలని అనుకుంటున్నారు. హృతిక్ రోషన్ ఇప్పటికే ఈ చిత్రాన్ని కొన్ని సార్లు చూసినట్టు తెలిసింది. అంతేకాకుండా క్లైమాక్స్ లో కొన్ని మార్పులు కూడా దర్శకుడు కోరట్ల శివకు సూచించినట్టు తెలిసింది. హిందీలో కూడా కోరట్ల శివే దర్శకత్వం వహిస్తారు. కోరట్ల శివ మాట్లాడుతూ హృతిక్ రోషన్ ను నటించమని అడిగామని, ఆయన స్పందన కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. హృతిక్ రోషన్ సూచించిన మార్పులు చేసి దర్శకుడు శివ రోషన్ ని కలుస్తారని, అప్పటికి ఒక క్లారిటీ రావచ్చని అనుకుంటున్నారు.

Send a Comment

Your email address will not be published.