అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సోమవారం అర్దరాత్రి హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్నారు. సుమారు 200 మంది పారిశ్రామిక ప్రతినిధుల బృందంతో హైదరాబాద్ వస్తున్న ఆమెకు విమానాశ్రయంలో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్వాగతం చెబుతారు. ఆమె ఇక్కడ ప్రపంచ పారిశ్రామిక సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు 28 వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరుగుతుంది. మొదటి రోజు సదస్సులో ప్రధాని కూడా పాల్గొంటారు.
ఆమె మొదటి రెండు రోజులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఆమె వెంట వచ్చే ప్రతినిధి వర్గంలో ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూప్ అధినేత, తెలంగాణాకు చెందిన పులి రవి కూడా ఉన్నారు. ఆయన అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నారు. అమెరికా తోడ్పాటుతో హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలను ప్రారంభించడంపై ఆమె ఇక్కడి ముఖ్యమంత్రి, సాంకేతిక మంత్రులతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఆమెకు పారిశ్రామిక సదస్సులు చేనేత చీర, వజ్రాల గొలుసు బహూకరించబోతున్నట్టు నటి సమంత తెలిపారు.