అంతరిక్ష పరిశోధనలో భారత ప్రస్థానం

సుమారు 20 ఏళ్ల క్రితం భారతదేశానికి, ఇప్పటి భారత దేశానికీ పోల్చి చూస్తే సమాచార ప్రసార సౌకర్యల్లోనూ, ప్రక్రుతి వైపరీత్యాల గురించి ముందుగానే తెలియజేయడంలోనూ, రేడియో నెట్వర్కింగ్ లోనూ, జలవనరుల నిర్వహణలోనూ ఇలా అన్ని రంగాల్లో ఎంతో ముందడుగు వేసిందనడానికి ఎంత మాత్రమూ సందేహం లేదు.
ఇంతటి పురోగతి జరిగిందనడానికి ముఖ్య కారణం అంతరిక్ష పరిశోధనలు, అంతరిక్షంలోకి ఎన్నో ఉప గ్రహాలు పంపి వాటి ద్వారా మన భూమిపై జరుగుతున్న పరిణామాలు సమగ్రంగా పరిశీలించడం, అన్వేషణకు తోడ్పడడం.

పశ్చిమ దేశాలు భారత దేశాన్ని మూడవ ప్రపంచ దేశంగానే పరిగణించినా మన శాస్త్రజ్ఞులు వారి ఊహల్ని తోసి రాజని ఎంతో ముందుకు వెళ్లారు. హాలీవుడ్ లో ఒక సామాన్యమైన సినిమా ఖర్చంత కూడా చేయకుండా అంగారక గ్రహానికి ఒక అంతరిక్ష నౌక పంపగలిగిందంటే అది సామాన్యమైన విషయం కాదు. “మేరా భారత్ మహాన్” అని వేయి గొంతుకలు కలిసి ఈ విశ్వపుటంచులు దాటి పొలికేక పెట్టాలని ప్రతీ భారతీయుడు ఉద్రేకంగా ఆవేశ పడే క్షణం. మానవుడే మహానీయుడన్న లోకోక్తికి నిదర్సనం. ప్రపంచ దేశాలన్నీ సంభ్రమాశ్చర్యాలతో భారత్ వైపే చూసిన సుదినం. భారత దేశం మరలా స్వర్ణయుగానికి వెళ్తుందనడం అతిశయోక్తి కాదు.

ఆర్యభట్ట

భారతదేశపు మొదటి అంతరిక్ష నౌక “ఆర్యభట్ట” 19 ఏప్రిల్ 1975 సోవియెట్ లోని కపుస్తాన్ యార్ నుండి పంపడం జరిగింది. అటు తరువాత రోహిణి శ్రేణి ప్రయోగాత్మక ఉపగ్రహాలు ఎన్నో పంపడం కూడా జరిగింది. ఆపై స్వదేశీ స్వయం పరిజ్ఞానంతో తయారుచేసిన ఇన్సాట్ అంతరిక్ష నౌకలను చాలా వాటిని అంతరిక్షంలోకి పంపడం జరిగింది. ఇవి ముఖ్యంగా భూ స్థిర కక్ష్యలో ఉండి భూగోళ పరిశీలన, దూరదర్శిని, తంతి మొదలైన దూర ప్రసరణలకు ఉపయోగపడతున్నాయి.

ఇండిపెండెంట్ రీజినల్ నావిగేషన్ సెటిలైట్ సిస్టం (IRNSS)

ఖచ్చితమైన స్థాన సమాచారం అందించడానికి ఈ ఇండిపెండెంట్ రీజినల్ నావిగేషన్ సెటిలైట్ సిస్టం(స్వతంత్ర ప్రాంతీయ గమనా గమన వ్యవస్థ) ఉపయోగ పడుతుంది.
కక్ష్య పరిధి నుండి షుమారు 1500 కిలోమీటర్ల దూరంలో స్థానగమన సమాచారాన్ని అందిస్తుంది. ఈ పద్ధతివలన Global Positioning System (GPS) తో అనుసంధానం కుదురుతుంది.

తదుపరి…

మానవ అంతరిక్ష ప్రయాణం తరువాత లక్ష్యం. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రయోగాలు ముమ్మరం చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఇంకా ఏడేళ్ళలో మానవులను అంతరిక్ష యానానికి తీసుకెళ్ళే ప్రయత్నానికి పునాదులు వేయడం జరుగుతోంది. ఇప్పటికే అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో రెండేళ్లలో చంద్రుడి మీదకు వెళ్లేందుకు, మరో నాలుగేళ్ళలో మరోసారి అంగారకుడి మీదకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈసారి చంద్రుడి మీద కాలు పెట్టేలా ప్రయోగం చేయాలన్న ఆలోచనలో కూడా ఉంది. ఇది కాక, కమ్యూనికేషన్ రంగంలోకి కూడా మరింతగా చొచ్చుకు పోవడానికి పలు ఉపగ్రహాల ప్రయోగానికి కూడా ఇస్రో క్యాలెండరు తయారు చేసింది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే 2020 నాటికి భారతదేశం అంతరిక్ష రంగంలో అగ్రస్థానంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Send a Comment

Your email address will not be published.