ఆంధ్ర జాతి - తెలుగు భాష

ఆంధ్రులు ప్రాచీన పౌరాణిక ప్రభంధ కాలానికి చెందిన వారిగా చరిత్ర వెల్లడిస్తోంది. అందుకు ఎన్నోఆధారాలు రామాయణ కావ్యం లోనూ మహాభారత ఇతిహాసంలోనూ కనిపిస్తాయి. ఆ రెండుయుగాల తదనంతర కాలంలో వెలువడిన మరెన్నో పురాణాలతో బాటుగా బౌద్ధమతానికి చెందిన అనేక జాతకకథలుకూడా ఈవిషయాన్ని పలువిధాలుగా బలపరుస్తున్నాయి. శాతవాహనులు అమరావతి నగరాన్ని నిర్మించి ఆంధ్ర దేశాన్ని పాలించిన రోజుల్లో బౌద్ధమతం ప్రభావం చాలావరకు తగ్గిపోయింది. ఆ తర్వాత ఇక్ష్వాకులు కృష్ణానదీ తూర్పుతీర ప్రాంతాలని తమ ఆధీనంలోకి తీసుకుని ‘విజయపురి’ పట్టణాన్ని (నాగార్జున కొండ) నిర్మించి ఆ నగరాన్ని రాజధానిగా చేసుకుని క్రీ.పూ.రెండవ శతాబ్దకాలందాకా ప్రశాంతంగా పరిపాలించారు. వారి అనంతరం బ్రిహత పలాయునులు, ఆనంద గోత్రీకులు, సాలంకునులు, విష్ణుకుండినులు కోస్తాంధ్ర చక్రవర్తులుగా కొనసాగారు.

ఆ తర్వాత పల్లవ రాజ వంశీయులు కాస్తా కోస్తా రాయలసీమ ప్రాంతాలని ఆక్రమించుకోవటం జరిగింది. తమిళనాడులోని కాంచీపురం రాజధానిగా వారీ ప్రాంతాన్నిదాదాపు తొమ్మిదవ శతాబ్దకాలందాకా పాలించారని చరిత్రకారులు తెలుపుతున్నారు.

పల్లవుల పాలనాకాలంలోనే ఆంధ్రులని అధికారపూర్వకంగా తెలుగువారిగా పిలువటం మొదలయింది. అందు వల్లనే కాబోలు కాకతీయుల పాలనలోనూ కృష్ణదేవరాయల కాలంలోనూ కూడా ఆంధ్రులనే పేరేలేకుండా అందరూ తెలుగు జాతికి చెందిన వారుగానే పరిగణించ బడటం జరిగింది ఆ కారణంగా ప్రాధమిక ప్రాచీన భారతీయచరిత్రలో ఆంధ్రులకి విశిష్ఠ స్థానం లేదు.

కాని అదే సందర్భంగా పౌరాణిక గ్రంధాలలో మాత్రం విశిష్ఠ జాతికి చెందిన ఆంధ్రుల ప్రసక్తి కనిపిస్తుంది. ” హరివంశం” అను పురాణంలో మధురానగరం పైన దండెత్తి వచ్చిన చాణూరుడనే చక్రవర్తిని శ్రీకృష్ణుడు అతి సునాయాసంగా ఓడిస్తాడు. ఆ చాణూరిడి సామ్రాజ్యం వింధ్యా పర్వతగిరి సానువులనుంచి యమునా నదీ తీరం వరకు విస్తరించి వుండిందని తెలుస్తోంది.

యిక ‘చాందోగఉపనిషత్తు’ ఆధారంగా ఆంధ్రులు వింధ్య గిరి సానువుల్లో ఎక్కువగా నివసించే వారని తెలుపుతోంది.
అది కాకుండా ప్రాకృత ‘ఐతరేయబ్రాహ్మణీయం’ అనే గ్రంధం కూడా ఆవిషయాన్నే బలపరుస్తోంది.

అదేవిధంగా “ శేషోన్నయం ఆంధ్ర భాష సుజనోత్సవ మొప్పగ నిర్వచించి…” అంటూ “నృసింహపురాణం”లోని o పద్యంలో కూడా ఆంధ్ర శబ్దం వినియోగించబడింది.

అది కాకుండా రామాయణ మహాభారత గ్రంధాల్లో కూడా ఆంధ్రుల వివరాలు మనకు లభిస్తాయి.

రామాయణ గాథానుసారంగా ఆంధ్రులు విశ్వామిత్ర మహర్షి వంశానికి చెందిన వారిగా కూడా తెలుస్తోంది. ఒకానొక నరమేధ యాగసందర్భంగా ఆ యజ్న నిర్వాహకులు సునాస్సేపు అనే ఆంధ్రుడిని బలిపశువురూపంలో అర్పణకు ప్రయత్నిస్తున్న సమయంలో కాపాడి అతనిని తన పుత్రుడిగా దత్తత తీసుకున్నాడట ఆ మహర్షి.

యిక మహాభారతగాథ ఆధారాలు యిలా తెలియ జేస్తున్నాయి.

కవిత్రయంలో నన్నయ తర్వాత విరాట పర్వ ఆంధ్రీకరణ ప్రారంభ దశలో “ఆంధ్ర కవితా విశారదుండు విద్యాదాయితుండు నరించే మహితాత్ముడు నన్నయభట్టు దక్షతన్ “ అంటూ ఆదికవి నన్నయామాత్యుని కీర్తించాడు మహాకవి తిక్కన..

అదే వ్యాస భారత కథనాధారంగా సహదేవుడు ఆంధ్రులని చిత్తుగా ఓడించాడని తెలుస్తోంది. యిక అదే కాలంలో నివసించిన ఆపస్థంభమహర్షి వర్ణనల ప్రకారం నాటి ఆంధ్ర బ్రాహ్మణులు అతి గొప్ప విద్వత్వేత్తలుగా కొనియాడ బడేవారని తెలుస్తోంది.

ఇక కుమార సంభవం కావ్యంలో “మను మార్గ కవిత లోకంబున ఆంధ్ర విషయంబున దేశి కవిత బుట్టించి తెనుగున జన చాళుక్య రాజులు మొదలుగా బలువుర్”అను నన్నే చోడుని పద్యమే అందుకు నిదర్శనం.

ఏమయితేనేమి ప్రాచీనాంధ్రులు వింధ్యగిరుల ప్రాంతానికి చెందినా వారనీ, బ్రతుకుతెరువు కోసం ఉత్తర దిశకు వెళ్ళినవారుగా పిలువబడుతూ సాళ్వ సామ్రాజ్యంలో ఆ యమునా నదీతీరపు అడవుల్లో నిలదొక్కుకోలేక మళ్లీ వెనక్కి రావటమూ అలా వెనక్కి వచ్చిన వారిలో ఎక్కువ శాతం కళింగ ప్రాంతానికి చేరుకోవటమూ జరిగిందని చారిత్రిక ఆధారాలు వెల్లడిస్తున్నాయి .

యిక అలనాటి కళింగ దేశాన్ని చేరిన ఆంధ్రులు స్థానిక తెలంగు నదీ తీరంలో చాలా కలం నివసించాక మరింత మెరుగయిన బ్రతుకు తెరువును అన్వేషిస్త్తూ అదే తెలోంగ్ నదీతీరంనుండి నేటి చత్తీస్ ఘడ్ రాష్ఠ్రం, భద్రాచలం ఆటవిక మార్గాల ద్వారా గోదావరి నదిని చేరి అక్కడ రెండు భాగాలుగా విడిపోయారు. అలా విడిపోయిన వారిలోని అధికభాగం వలసకారులు గోదావరి దక్షిణ దిశలోని నేటి తెలంగాణా జిల్లాలలోకి వెళ్ళగా మిగిలిన వారు గోదావరి ఉత్తర భాగంలోని ఆదిలాబాద్ ఆటవిక మార్గాలద్వారా మహారాష్ఠ్ర , కర్ణాటక రాష్ఠ్రాలకి వెళ్ళి పోయారని చరిత్రకారులు భావిస్తున్నారు. . .

అదే క్రమంలో వారిలో మిగిలిన వారు ఒరిస్సానుంచి సముద్ర తీర ప్రాంతాల్లో నిలదొక్కుకున్న ఆంధ్రులుగా పరిగణించబడ్డారు. అలాగే వారిలోని మరికొందరు బంగాళా ఖాతం తీర ప్రాంతాలని ఆశ్రయిస్తూ దక్షిణాదికి చెందిన పాండిచ్చేరి, తమిళనాడులకు వలస వెళ్ళగా వారా ప్రాంతాల్లో నేటికీ ‘తెలుంగు’ వారిగా పిలువ బడుతున్నారు..

కాల గమనంలో తెలుగు జాతి ఒరిస్సాలోని కళింగ ప్రాంతాన్ని మొదలుకుని కోస్తా జిల్లాలని, తెలంగాణా ప్రాంతాన్ని మాత్రమే తమ శాశ్వత ప్రాంతాలుగా పరిగణించుకుంది . కాని అదే కాలంలో తమిళ కర్ణాటక రాష్ఠ్రాలలో తెలుగు వారు ఏర్పరుచుకున్న ప్రాంతాలని వారెందుకు తమలో కలుపుకోలేదో తెలియటం లేదు. తద్వారా తెలుగు వారు అధిక సంఖ్యలలో నేటికీ నివసిస్తున్నదిగువ చిత్తూరు, కోలారు, బళ్ళారి, రాయచూరు, గుల్బర్గా ప్రాంతాలు నేటికీ ఆయారాష్ఠ్రాలలోని అంతర్భాగాలుగానే చెలామణీ అవుతున్నాయి.

ఆవిధంగా ఆకాలంలో తొలుతతొలుతగా ఏర్పడిన స్థావర సముదాయమే నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ఠ్రంలోని కోస్తా ఆంధ్ర ప్రాంతంగా చెప్పబడుతోంది. అలాగే అక్కడి జనం అంతా ఆంధ్రులుగానే పిలువబడుతూ వచ్చారు.
కాని భద్రాచలం దిగువ గోదావరి దిశకు చేరుకున్న ఆంధ్రులు మాత్రం’తెలంగు’ నదీతీరంనుంచి వచ్చిన ‘తెలంగీయులు’గా పిలువబడటంతో వారు నివసించిన ప్రాంతానికంతా నేటి తెలంగాణాగా పేరువచ్చింది

ఆలా మార్పులు చెందిన ఆంధ్రుల జీవిత చరిత్రలో అనగా క్రీ పూ 700–300 కాలంలో శాతవాహన రాజులు అమరావతీ నగరాన్ని నిర్మించటం జరిగింది. ఆనగరంలో నివసించిన ఆంధ్రులే ఆ ప్రాంతంలో విస్తరిస్తూన్న అశోకుని బౌద్ధమత ప్రచారానికి అడ్డుకట్టలు వేసినవారయ్యారు

క్రీ పూ 624 – 1323ల మధ్య కాలంలో బౌద్ధమత విరామానంతరం మతపరంగానూ, ఆంధ్ర సాహిత్యంపరంగానూ, తెలుగు భాషలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. కాకతీయ సామ్రాజ్య కాలంలో యావత్తు తెలుగునేల వారి ఆధీనంలోకి వచ్చింది. ఆకాలంలో తెలుగు భాష ఒక్కసారిగా ప్రాచీన ప్రాకృతిక, సంస్కృత భాషల్ని మించిపోయింది. ఆకాలం లోనే జీవించిన ఆది కవులు నన్నయ, తిక్కనల సాహితీ ప్రభావం కూడా అందుకు తోడయింది.

ఆ తర్వాత విజయ నగర సామ్రాజ్య కాలానంతరం ఆంగ్లేయుల పరిపాలనలో రాబర్ట్ క్లైవ్ అనే అధికారి విశాఖపట్టణం ప్రాంతాన్నికలుపుతూ అప్పటి మొఘల్ చక్రవర్తినుంచి ఐదు జిల్లాలని క్రీ.శ .1765 లోఒక అంగీకార ప్రక్రియ ద్వారా తన ఆదీనంలోకి తీసుకుని వాటిని సర్కారు జిల్లాలుగా చెలామణీలోకి తీసుకు వచ్చాడు.

తదనంతరం ఆధునిక జన వర్గం ఆంద్రరాష్ఠ్ర స్థాపనకి నాంది పలికింది. అందుకు భారత స్వాతంత్రోద్యమ సంగ్రామంలో మునిగి తేలుతున్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కూడా వారికి మద్దతు పలికాడు. శ్రీ ప్రకాశం పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి ఉద్దండులు ప్రారంభించిన ఆఘట్టం కాస్తా మొదటి సారిగా కర్నూలు రాజధానిగా 1953’లో తొలి రూపు దాల్చి ఆ తర్వాత 1956’లో ఆంధ్రప్రదేశ్ రాష్ఠ్రస్థాపనతో స్థిరపడి పోయింది.

కాని ఆ విధంగా సమైక్య జీవనానికి నాంది పలికిన తెలుగు సోదరులలో కొందరు 1969’లోనే తిరిగి విడిపోయే సన్నాహ చరిత్రను సృష్టించి ప్రత్యెక తెలంగాణా ఉద్యమానికి నాంది పలికారు. కాని అప్పట్లో కొద్దికాలంలోనే చల్లారి పోయిన రాష్ఠ్ర విభజన అంశం కాస్తా మళ్లీ ఈ ప్రత్యెక తెలంగాణా వాదంతో 2001’లో తిరిగి వెలుగులోకి వచ్చింది .

దాంతో గత పన్నెండేళ్ళుగా ఆ సమస్యతోనే సతమతమవుతోంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ఠ్రం. ఆ అలజడులకు తోడుగా నేడు సమైక్యాంధ్ర వాదంతో బాటుగా సీమాంధ్ర వాదం కూడా ఉధృతంగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్తితుల్లో ఏం జరుగనుందో
వేచి చూడాల్సిందే!

ఆవిధంగా గత యాభయ్ ఏడేళ్ళుగా కలిసివుంటున్న తెలుగు సోదరులు నేడు విడిపోయే సన్నాహ చరిత్రను సృష్టించి ప్రత్యెక తెలంగాణా ఉద్యమానికి నాంది పలికారు. 1969’లో శ్రీ మర్రి చెన్నారెడ్డిగారు ప్రారంభించిన ఈ ప్రత్యెక తెలంగాణా వాదాన్నిశ్రీ కెసిఆర్ గారు మళ్లీ 2001’లో తిరిగి వెలుగులోకి తీసుకు వచ్చారు.

దాంతో గత పన్నెండేళ్ళుగా ఆ సమస్యతోనే సతమతమవుతోంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. ఆ అలజడులకు తోడుగా నేడు సమైక్యాంధ్ర వాదం కూడా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్తితుల్లో కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం మాత్రం 2014’లో తెలంగాణా రాష్ట్రం ఏర్పాట్లు పూర్తవుతాయన్నబలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. వాటి అనుసారంగా కేంద్ర పాలకమండలి సభ్యులు రాష్ఠ్రపతితోనూ, రాష్ఠ్ర శాసనసభా సభ్యులతోనూ చర్చించబోతున్నారన్నవిషయం వినికిడిలోకి వస్తోంది. అదికాకుండా ప్రధాన మంత్రి కూడా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకుచెందిన ప్రజా ప్రతినిధులతో oఒక అనుకూల వతావరణాన్నిసమకూర్చుకుని వారితో సంభాషించనున్నారని కూడా తెలుస్తోంది. ఆ సంభాషణల్లోనే రాష్ఠ్ర ఆదాయ విభజన, నదీజలాల పంపిణీ వగయిరాలు చర్చించ బడవచ్చునని కూడా అనుకుంటున్నారు. ఆ ప్రతిపాదనలన్నీ కూడా ఇరుపక్షాలా ఒక సామూహిక అంగీకార రూపం ఏర్పడిన తర్వాతనే కేంద్ర పార్లమెంట్ రాష్ఠ్రవిభజన విషయం పైన తగునిర్ణయాన్నితీసుకోగలదన్నవిషయాన్నిమనం తెలుసుకోవాలి.

SP Chari

Send a Comment

Your email address will not be published.