క్రీస్తు ధృక్పథం !‏

ఈ పండుగ సందర్భంగా యూరప్ ఖండంలోని  ‘రోమ్’ దేశంలో నిలిచి వున్న ‘వెటికన్’ నగర క్రీస్తుదేవుని ధృఖ్పథంతో బాటుగా ఆ విఖ్యాత దివ్యక్షేత్ర ప్రాశస్త్యం గురించి కూడా తెలుసుకుందాం !

స్వయం ప్రతిపత్తి కలిగిన ఒకే ఒక అతి చిన్న స్వతంత్ర దేశంగా వెటికన్ నగరం ప్రపంచ పటంలో వెలిగి పోతోంది.  కాని విశేషం ఏమిటంటే కనీసం ఓ మహానగరం అని కూడా చెప్పుకోలేని పరిస్తితుల్లో కూడా యిదో దేశంగానూ,  విశ్వ విఖ్యాతి గాంచిన అంతర్జాతీయ ప్రముఖ దర్శనీయ పుణ్య  క్షేత్ర కేంద్రంగానూ చెప్పుకో బడుతోంది.  అంతే కాకుండా ఈనగరం విశ్వ క్రిస్టియన్ మత వ్యవస్థకు నాంది పలికిన ప్రాంతంగానూ ,ఆ మతపరంగా యావత్ప్రపంచానికే ఏకైక గురుదేవుడుగా ప్రసిద్ధి చెందిన ‘పోప్ పాల్’ నివాస కేంద్రంగానూ ప్రసిద్ధిచెందింది.

‘జీసస్ క్రీస్తు’ మహాదేవుడే ‘పోప్’ మహాశయుణ్ణి తన వారసుడిగా ప్రకటించాడని క్రీస్తుమత గ్రంధ ప్రవచనాల ద్వారా తెలుస్తోంది. తద్వారా జీసస్ గొర్రెల కాపరితనం పోప్ వారసత్వంగా పరిణితి చెందింది. అయితే జీసస్ తర్వాత గొర్రెలకు బదులుగా  మనుషులని ప్రేమించటమూ  వారిని కాపాడటమూ విశ్వవ్యాప్తంగా పోప్ బాధ్యతలుగా మారాయి.  అందువల్ల సర్వ సాధారణంగా తనను దర్శించటానికి వచ్చే జనం బాధల్ని వినటం …ఆ తర్వాత వారిని ఆబాధలనుంచి విముక్తుల్ని చేయటం పోప్ యొక్క బాధ్యతలుగా రూపు దిద్దుకున్నాయి.  ఆబాధ్యతా పరంగా దేశ దేశాల్లోని కాథలిక్ మత ప్రముఖుల్ని కూడా తన అనుచరులుగా గుర్తిస్తూ వారికీ తన వారసత్వ గౌరవాన్ని అందిస్తూ అక్కడి చర్చ్ లన్నింటికీ రక్షకులుగా వ్యవహిరింపచేయటం శాశ్వత ప్రాతిపదికగా కొనసాగుతోంది. ఈ చర్యఅనుక్రమణ  కారణంగా ప్రపంచంలోని క్రీస్తుమతస్తులందరికీ వెటికన్ యాజమాన్యం ఆయా దేశాల లోని చర్చ్’ల నిర్వాహక బాధ్యతలకి మార్గదర్శిగా వ్యవహిరిస్తోంది.  అందువల్ల వెటికన్ దేశం నేటి ప్రపంచ దేశాలన్నిటికీ క్రిస్టియానిటీ మాతృవ్యవస్థ గా చెలామణీ అవుతోంది.

వెటికన్ సిటీలో పోప్ తర్వాత ఆయన బాధ్యతల్ని కొన్నింటిని రోమ్ దేశానికి చెందిన కాథలిక్ చర్చ్ క్షేత్ర నిర్వాహక ముఖ్య పాలకునికి సంక్రమింప చేయబడ్డాయి.

వెటికన్ సిటీ నేడు ఒక స్వతంత్ర దేశంగా ప్రపంచ దేశాల సమాఖ్యలో కూడా సభ్య్తత్వాన్ని పొందింది. ఈ దేశపు ఆదాయమంతా పోప్ దర్శనానికి వచ్చే కోట్లాది భక్తుల సహకారాన్నుంచే లభిస్తోంది.  నగరంలోని చర్చ్’ ల నిర్వాహకులనుంచీ, స్థానిక క్రీస్తు క్షేత్రాల మ్యూజియం లనుంచి కూడా విపరీతమయిన ఆదాయం అందుకు తోడవుతోంది.

స్థానికులకి వెటికన్ నగరపు పాలక వ్యవస్థ ద్వారానే పాస్ పోర్టులు లభిస్తుంటాయి.  దాని వెంటే రోమ్’ని దర్శించే యితర దేశాల యాత్రీకులకు ఎటువంటి నిభందనలు విధింప బడకపోవటం యిక్కడి సాధారణ ఆచారంగా కొనసాగుతోంది.  అదికాకుండా ప్రపంచపు నలుమూలల్లోనూ అనేక రకాల వెటికన్ రవాణా పథకాలు శాశ్వత పద్ధతుల రీత్యా అమల్లో నిలకడగా వున్నాయి. అందువల్ల ఈ విశ్వక్రీస్తుక్షేత్ర  దర్శనం అతి సులభంగా లభిస్తోంది.

 

Send a Comment

Your email address will not be published.