తెలుగు మాట - తీయని బాట

అమ్మ గర్భంలో ఉన్నప్పుడే మనతో మాట్లాడిన మన భాష మనల్నందరినీ ఒక పాశంలా ఏకం చేసింది. మన సంస్కృతిలోనూ భాషలోనూ ఉన్న మాధుర్యాన్ని, మమకారాన్ని మన భాషలోనే ఆస్వాదిస్తూ తల్లి సంస్కృతిని పునః ప్రతిష్టించుకునే ప్రయత్నం ఈ తెలుగుమల్లి ఆశయం. ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్ దేశాల్లో షుమారు 50 ఏళ్లకు పైగా తెలుగు వారు వలస వచ్చి తమ సంస్కృతీ సంప్రదాయాలు నిలబెట్టుకొనే ప్రయత్నంలో అహర్నిశలూ కృషి చేస్తూ ఈ రెండు దేశాలు బహుళ సంస్కృతి సంప్రదాయానికి అందిస్తున్న చేయూతను అండగా తీసుకొని దిన దిన ప్రవర్ధమానంగా ముందుకు సాగుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. అయితే ప్రతీ నగరంలో తమ తమ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ నగరానికే పరిమితమౌతున్నారు. ఇతర నగరాల్లో జరుగుతున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకోవాలన్న కోరిక వున్నా సరైన మాధ్యమం లేకపోవడం వలన ఇది సాధ్యం కావడం లేదనేది నిర్వివాదంశం.

మన మధ్య ఎంతో మంది కవులు, రచయితలూ, సాహిత్యాభిమానులు, కళాభిమానులు, భాషాభిమానులు, ఇలా చాలా మంది మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాల్ని పలు రకాలుగా చేపడుతున్నారు. దేశం కాని దేశంలో భిన్న సంస్కృతుల మధ్య పర సంస్కృతితో సహజీవనం చేస్తూ మన సంస్కృతిని నిలబెట్టుకోవాలన్న తపన పడే వాళ్ళందరూ అభినందనీయులు. వారియొక్క కార్యక్రమ వివరాలను అది కధ గానీ, కధనం గానీ, వార్త గానీ ఏదైనా మన తెలుగువారందరితో పాలుపంచుకోవడమే ఈ తెలుగుమల్లి ముఖ్యోద్దేశ్యం. ఈ మహోన్నతమైన ఆశయంతోనే ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్ దేశాల్లోని తెలుగు వారి కార్యక్రమాలతో పాటు సాహిత్యం, స్వరాష్ట్ర విషయాలు, భవిష్యవాణి, వంటకాలు, పిల్లలు తెలుగు నేర్చుకోవడానికి వీలుగా ఎన్నో దృశ్య శ్రవణ అంశాలను తెలుగుమల్లి అంతర్జాలంలో పొందుపరచడం జరిగింది. మన తెలుగువారికి భారతీయులకు ఉపయోగపడుతుందంటే ఏ విషయాన్నైనా తెలుగుమల్లిలో ప్రచురించడం జరుగుతుంది.

తెలుగువారి భగవద్గీతగా వర్ణింపబడ్డ “పెద్ద బాల శిక్ష” పుస్తకాన్ని ఈ వెబ్సైటు న్యూస్ లెటర్ కు అర్దించే ప్రతి ఒక్కరికీ ప్రత్యెక కానుకగా త్వరలోనే అందించడం జరుగుతుంది.

Send a Comment

Your email address will not be published.