దసరా శుభాకాంక్షలు

తెలుగుమల్లి పాఠకులందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటుంది.

గత నెల 29 వ తేదీన జరిగిన వినాయక చవితి పండగను పురస్కరించుకొని ఎన్నాళ్ళనుండో ఎదురు చూస్తున్న శ్రీ తనికెళ్ళ భరణి గారి ఆస్ట్రేలియా సందర్శన ఎంతో వైభవంగా ముగిసిందనడంలో సందేహం లేదు.  ఇంతకు ముందు రెండుసార్లు ఆస్ట్రేలియా వచ్చినా మెల్బోర్న్ నగరం రావడం ఇదే మొదటిసారి.  సిడ్నీ, మెల్బోర్న్ మరియు పెర్త్ నగరాల్లో శ్రీ భరణి గారి సాహితీ పురాణం ఉత్తుంగ తరంగాలై వారు వినిపించిన “శృంగార గంగావతరణం” (తెలుగు మల్లి హోం పేజీలో ఈ వీడియొ ని మీరు చూడవచ్చు)  లా భారతదేశపు హిమగిరి పర్వతాల నుండి ఆస్ట్రేలియా ఖండం వరకు సెలఏరులై పారింది.

ముందుగా సిడ్నీలో జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లో (ఆగష్టు 29, 30) పాల్గొని 31 వ తేదీన మెల్బోర్న్ చేరుకున్నారు.  అదే రోజు మధ్యాహ్నం తెలుగుమల్లి మరియు భువన విజయం (మెల్బోర్న్ సాహితీ సంవేదిక) నిర్వహించిన “తెలుగు కళా తోరణం” కార్యక్రమంలో పాల్గొన్నారు.  శ్రీ భరణి గారు ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతమైన వేడుకగా అభివర్ణించారు.

 

ఆంధ్ర దేశంలో లేని తెలుగు ఆస్త్రేలియాలో ఉందనటానికి “తెలుగు కళా తోరణం” నిదర్శనం అని ఘంటాపధంగా చెప్పారు.  (“తెలుగు కళా తోరణం” వీడియో కూడా తయారుచేయడం జరిగింది.  కావాలనుకున్నవారు తెలుగుమల్లిని సంప్రదించవచ్చు.)  మెల్బోర్న్ తెలుగు కళా తోరణం విశేషాలు

ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని కవులు, రచయితలు భాషాభిమానులు కలిసి వ్రాసిన పుస్తకం “కవితాస్త్రాలయ – 2014” పుస్తకాన్నిశ్రీ భరణి గారు ఆవిష్కరించారు.  ఇందులో ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాలలోని కవులు 25 మంది వ్రాసిన కవితలు, కధలు, శాయిరీలు వున్నాయి.

శ్రీ భరణి గారు వ్రాసిన “ప్యాసా” పుస్తకం కూడా ఈ వేదికపై ఆవిష్కరించడం జరిగింది.  ఈ పుస్తకంలోని 25 కవితా మధురిమలు ఉర్దూ శాయిరీలను పోలిన రచనలు ఉన్నాయి.

పైనుదహరించిన రెండు పుస్తకాలు (“కవితాస్త్రాలయ – 2014” ,  “ప్యాసా”) కావాలనుకున్నవారు తెలుగుమల్లి (contact@telugumalli.com) ని సంప్రదించి కొనుక్కోవచ్చు.

దసరా నవరాత్రులు సందర్భంగా ఆస్ట్రేలియా న్యూ జిలాండ్ దేశాల్లోని తెలుగువారందరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ మన సంస్కృతిని తరువాతి తరానికి అందివ్వాలన్న తాపత్రయ పడడం ఎంతో కొట్టొచ్చినట్లు కనబడుతుంది.  ఇందులో భాగంగా బతుకమ్మ పండగని అన్ని ప్రాంతాల్లోనూ జరిపించి తెలుగువారే కాకుండా స్థానిక బహుళ సంస్కృతీ సంస్థలను కూడా పాల్గొనడానికి అవకాశం కల్పించారు.

మరిన్ని వివరాలకు రాష్ట్రాల విభాగాల్లో చూడగలరు.

Send a Comment

Your email address will not be published.