మన తెలుగువారు ఆస్ట్రేలియా న్యూ జిలాండ్ దేశాలకు రావడం వెళ్ళడం ఎప్పుడో జరిగివుండవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి స్థిరపడి మన కల్లెదుటుగా వున్నవాళ్ళ కాలప్రమాణం అర్ధ శతకం దాటింది. మొదటిగా వచ్చిన వాళ్ళు మన ఆహార పదార్ధాలు దొరకక ఎన్ని ఇబ్బందులు పడ్డారో చాలామందికి తెలుసు. చింతపండుకి బదులు వెనిగర్ వాడే రోజులవి. పార్కులో కారులో కూర్చొని సినిమాలు చూసే కాలమది. తెలుగువారు ఎక్కడైనా కనపడతారా అని సందేహించే సమయమది. ఆ కాలంలో తెలుగువాళ్ళ సంగతి అటుంచి ఒక భారతీయుడు కనపడితే కనుబొమ్మలు రెండింతలు చేసుకొని వారిని పలకరించి యోగ క్షేమాలు తెలుసుకొని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి మరీ పంపించేవారట. కాలానుగుణంగా అవన్నీ కనుమరుగై పోయాయి. కాలభ్రమణములో “మనందరం” అంటూనే “ఎవరికి వారు” గానే ఉండిపోయాం.
1960 – 70 దశకంలో వచ్చిన వారి సంఖ్య వేళ్ళ మీద లెక్కించవచ్చు. ఆ కాలంలో వచ్చినవాళ్లు చాలామంది వారి వారి వృత్తులలో నిష్ణాతులు కాబట్టి ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రత్యెక ఆహ్వానం పై ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. అప్పట్లో కంప్యూటర్ రంగం చెప్పుకోదగ్గ పురోగతి సాధించలేదు. కాబట్టి ఎక్కువమంది వైద్య, బోధనా మరియు పరిశోధనా వృత్తులలో పనిచేస్తున్నవాళ్ళు వచ్చేరంటే అతిశయోక్తి కాదు. 1980 – 90 దశకంలో వచ్చినవారు కొంతమంది కంప్యూటర్ సాంకేతిక రంగంలో మరియు ఇతర వృత్తులలో పనిచేసిన వాళ్ళు మిశ్రమ నిష్పత్తిలో వున్నారు. 1990 నుండి ఇప్పటివరకూ వచ్చిన వారు అధిక శాతం కంప్యూటర్ రంగంలోని వాళ్ళేనని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఇతర రంగాల నుండి వచ్చినవాళ్లు కూడా ఆయా రంగాలకు తిలోదకాలిచ్చి కంప్యూటర్ రంగంవైపే మొగ్గు చూపారు. ఇది ప్రపంచీకరణలో భాగంగా జరిగిన మార్పు. ఈ మార్పుకి ప్రపంచంలోని అన్ని దేశాలూ తల వగ్గాయనడంలో సందేహం లేదు.
చాలామంది తమ స్వంత వ్యాపార సంస్థలను నెలకొల్పుకొని ఇతరులకు ఉద్యోగాలు ఇవ్వడంలో సఫలీకృతులయ్యారు. సాంకేతిక, వైద్య, పరిపాలనా సంబందిత రంగాల్లో కూడా ఎంతోమంది పనిచేస్తున్నారు. రెండవ తరం ఇప్పుడిప్పుడే వృత్తి వ్యాపార రంగాల్లో అడుగు పెడుతున్నారు. బహుళ సంస్కృతీ సంప్రదాయానికి పట్టంగట్టే ఈ రెండు దేశాల్లో రాజకీయరంగంలో కూడా మనవాళ్ళు ముందడుగు వేస్తున్నారు. స్థానిక స్వచ్చంద సంస్థలకు సహాయ సహకారాల్నందిస్తూ జనజీవన స్రవంతిలో ఇమిడిపోయారు.
అయితే 2020 నాటికీ అంటే ఇంకో ఐదేళ్ళలో కొన్ని రంగాల్లోని వృత్తులకు భారీగా మార్పులు రావచ్చని ఆస్ట్రేలియా డిపార్టుమెంటు అఫ్ ఎంప్లాయిమెంట్ విభాగం వారు ప్రచురించిన ఒక నివేదికలో వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా అత్యాధునిక కంప్యూటర్ యంత్రాలు రావడం మూలంగా పరిపాలనా (అడ్మినిస్ట్రేటివ్) సంబంధమైన ఉద్యోగాలు తక్కువ అవుతాయని వివరించారు. విద్యా వేత్తలు, వైద్య నిపుణులు, పరిపాలనా దక్షులు managers), ఆర్ధిక నిపుణులు, న్యాయనిపుణులు, సామాజిక సేవా నిపుణులు మొదలైన వృత్తులలో ఉన్నవారికి ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉంటాయని వివరించారు.
ఆస్ట్రేలియా న్యూ జిలాండ్ దేశాల్లో షుమారు లక్షమంది ఉన్న తెలుగువారు ప్రముఖంగా కంప్యూటర్ రంగంలో స్థిరపడి ఉన్నారనటం సబబే. అయితే ఈ రంగంలో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హార్డువేర్) రంగంలో చాలా సంస్థలు క్లౌడ్ కంప్యూటింగ్ కి మొగ్గు చూపడం వలన నెట్వర్క్ ప్రొఫెషనల్స్ కి కొంత మేర ఉద్యోగాలు తగ్గవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో మరికొంత కాలం అంటే కనీసం 10 ఏళ్ళు బాగానే ఉంటుందని కాకపోతే ఇకముందు వచ్చే అప్లికేషన్స్ మొబైల్ ఫోన్లలోనూ, టాబ్లెట్ లోనూ ఉంటాయని కూడా తెలిపారు.
Occupation |
Employment level – November 2014 (‘000) |
Department of Employment Projections |
||
Projected employment level – November 2019 (‘000) |
Projected employment growth – five years to November 2019 |
|||
(‘000) |
(%) |
|||
managers![]() |
1532.9 |
1679.0 |
146.2 |
9.5 |
PROFESSIONALS |
2657.4 |
3033.8 |
376.3 |
14.2 |
TECHNICIANS AND trades![]() |
1724.9 |
1884.7 |
159.8 |
9.3 |
COMMUNITY AND PERSONAL SERVICE WORKERS |
1147.3 |
1352.8 |
205.5 |
17.9 |
CLERICAL AND administrative![]() |
1630.4 |
1751.8 |
121.4 |
7.4 |
SALES WORKERS |
1100.5 |
1210.9 |
110.4 |
10.0 |
MACHINERY OPERATORS AND drivers![]() |
751.4 |
776.9 |
25.5 |
3.4 |
LABOURERS |
1121.4 |
1142.6 |
21.3 |
1.9 |
ALL OCCUPATIONS |
11,610.1 |
12,776.5 |
1166.4 |
10.0 |
Courtesy: Department of Employment. Source: http://lmip.gov.au/default.aspx?LMIP/EmploymentProjections
పైన తెలిపిన పట్టిక ప్రకారం చాలామంది తెలుగువారికి వచ్చే 10 ఏళ్ళు బాగానే ఉంటుందనే అనుకుందాం. అయితే తరువాత సంగతేంటి?
న్యూజిలాండ్ లో ప్రస్తుతం వారి ఆర్ధిక పరిస్థితి స్థిమిత పడటం వలన ఉద్యోగాలు ముఖ్యంగా క్రిందనుదహరించిన రంగాలలో చాలా వున్నాయి:
-IT & Technology
-Engineering
-Finance
-Construction
-Hospitality & Tourism
-Manufacturing & Operations
-Logistics & Operations
-Healthcare
ఈ మధ్యనే మెల్బోర్న్ నగరంలో ఒక ఉద్యోగ సదస్సుని నిర్వహించి ఆ దేశంలో పనిచేయటానికి ఆహ్వానించారు.
1960 – 80 దశకాలలో వచ్చిన తెలుగువారు చాలామంది పదవీ విరమణ చేసి విశ్రాంతి పొందుతున్నారు. 1980 – 2000 మధ్యలో వచ్చిన వారు ఇంచిమించుగా కౌమార దశలో వుండి పిల్లలు స్థిరపడడానికి, పెళ్ళిళ్ళు చేయటానికి తోడ్పడుతూ షుమారు మరో పదేళ్ళు పని చేయటానికి ఎదురు చూస్తున్నారు. అయితే వీరిలో అనేకమంది సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని ముందు తరాలకు స్పూర్తినందిస్తున్నారు. మరికొంతమంది మన భాషా సంస్కృతుల పట్ల ఆదరాభిమానాలతో తమ వంతు కృషి చేస్తున్నారు.
గత పదేళ్ళలో వచ్చిన వారు సింహభాగం తమ 30వ పడిలోని వారే అనుకోవచ్చు. వీరికి పైనుదహరించిన గణాంకాలు చాలా అవసరం. ఎందుకంటే పదేళ్ళ తరువాత మన కర్తవ్యం ఏమిటనేది ఆలోచించవలసిన అవసరం వుంది. వ్రుత్తి ఉద్యోగాలలో గణనీయమైన మార్పులు రావచ్చు. దానికి అనుగుణంగా మన వరవడిని దిద్దుకోవటం అవసరం ఉండొచ్చు.