
మాయా బజార్ – సురభి నాటకం
తెలుగు నాటక రంగంలో ప్రత్యేక స్థానం పొందిన 135 ఏళ్ల చరిత్ర గల సురభి నాటక కళ మన సంస్కృతీ సాంప్రదాయాలకు నిలువుటద్దం. కాలానుగుణంగా వస్తున్న మార్పులకనుగుణంగా వారి కళాభిరుచిని గౌరవిస్తూ అంతర్జాల సాంకేతిక సహాయాన్ని అందిపుచ్చుకొని వారిచే ప్రదర్శించబడి పలు ప్రసంశలందుకొన్న ‘మాయా బజార్’ నాటకాన్ని ఆస్ట్రేలియా, సింగపూర్ మరియు దక్షిణాసియా దేశాలలోని తెలుగువారి కోసం ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారం అందించబోతున్నాము.