మిల్కీగర్ల్ హనీ బ్యూటీ తమన్నాతో చెమటలు కక్కించింది. స్టెప్పులు వేయించడానికి చెమటలు కక్కించింది డాన్సు మాస్టారో, దర్శకుడో కాదు. ఒక భవనం. ఆ అందమైన భవనం పేరు ఎంఐ6. లండన్ లోని థేమ్స్ నదీ తీరంలో ఉంది. అయితే ఆ భవనం లోకి ఎవరినీ అనుమతించరు. అయితే బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ మాత్రం అందులోకి వెళ్ళడానికి అనుమతి సంపాదించారు.’ హమ్ షకల్స్’ చిత్ర షూటింగ్ కోసం ఆ భవనాన్ని సాజిద్ సంపాదించాడు. అనుమతి దొరకడం తో చిత్ర యూనిట్ మొత్తం ఆనందంతో బిల్డింగ్ వద్దకు వచ్చారు. సైఫ్ అలీ ఖాన్, రితేష్ దేశముఖ్, రామ్ కపూర్లతో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా, బ్లాక్ బ్యూటీ బిపాసా, క్యూట్ గర్ల్ ఇషా గుప్తాలు కూడా వచ్చారు.
వీరంతా లిఫ్ట్ దగ్గరకు వచ్చేసరికి దిస్ లిఫ్ట్ ఈస్ అండర్ మెయిన్ టెనన్స్ అనే ఒక పెద్ద బోర్డు అక్కడ వేలాడుతుంది. దాంతో అందరూ ఒక్కసారిగా ఊసూరు మంటూ నిలబడి పోయారు. ఎందుకంటే వాళ్ళ షూటింగ్ జరిగేది 14 వ అంతస్తు లో. హీరో లతో పాటు హీరోయిన్లు కుడా ఎక్కడం మొదలు పెట్టారు. అయితే, వీరు తమ ఎత్తు చెప్పుల్ని చేతిలో పెట్టుకొని పాపం ఆపసోపాలు పడతా పధ్నాలుగు అంతస్తులు ఎక్కేసారు. అక్కడకు చేరగానే చలాకీ చిన్నది తమన్నా చక చకా ఫోటోలకి ఫోజు లు ఇచ్చిందట.