ప్రపంచంలోని ప్రాణులన్నీ అన్నం నుంచే పుడుతూ, అన్నం వల్లనే జీవిస్తూ, అన్నంలోనే చివరకు విలీనమవుతున్నాయి. పరమాత్మ సకల లోకాలలో, సర్వ భూతాలలో సర్వాత్మ యై నిండి అన్నాన్ని స్వీకరిస్తాడు.
అన్నమధికమైన అరయ మృత్యువు నిజము
అన్నమంటకున్న ఆత్మనొచ్చు
చంప బెంప బువ్వ చాలదా వేయేల
విశ్వధాభిరామ వినుర వేమా!
అన్నాడు యోగి వేమన. అన్నానికున్న ప్రాధాన్యతని వేదాలు కూడా వక్కాణించాయి.
`సహనా వవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహైః తేజస్వినామదీతమస్తు మా విద్విషావహైః ఓం శాంతిః శాంతిః శాంతిః’ ఇదే అన్న సూక్తం. అన్న సూక్తిని పాటించడం కూడా అన్నంపై భక్తీ భావాన్ని ప్రకటించుకోవడమే.
అందుకే ఆర్యులు `అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు. అన్నమే జీవిని బతికిస్తుంది. అన్నమే పోషిస్తుంది. అన్నమే ఆరోగ్యాన్నిచ్చి కాపాడుతుంటుంది. అన్నమే మనుగడకి ఆలంబనగా ఉంటుంది. చంపినా, పోషించినా సర్వులకూ అన్నమే ప్రదానం.
గింజ గింజకు తన ప్రేమనద్దగించి
అమ్మ గలిపిన అన్నపు ముద్ద
విందారగించిన నమృతప్రాయంబు
అవనికే అందంబు అమ్మరో మాయమ్మ
అమ్మ ప్రేమతో భారతదేశం నుండి ఆస్ట్రేలియాకు ఇక్కడ నివసిస్తున్న తెలుగువారితోపాటు ఇతర భారతీయులకు, స్థానికులకు నూతన బియ్యం రకాన్ని అందించాలన్న తపనతో “అమ్మాస్” బియ్యం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముఖ్యంగా “ఆరోగ్యమే మహాభాగ్యం” అన్న సూక్తిని దృష్టిలో పెట్టుకొని పౌష్టికాహారం విషయంలో ఏ మాత్రం సర్దుబాటు లేకుండా వివిధ పరిమాణాల్లో (5 kg, 10 kg, 20 kg) ఈ వారం నుండి మార్కెట్ లో విడుదల చేస్తున్నారు. బాసుమతి అంటే హిందీ భాషలో “King of Fragrance”. అయితే ఈ అర్ధానికి సరిక్రొత్త నిర్వచనాన్ని పొందుపరుస్తూ బియ్యం నింపే సంచులు సైతం గాలిని లోపలికి పీల్చడమే తప్ప బయటకు వదలకుండా (ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది) తయారుచేయడం జరిగింది. ఇటువంటి ప్రయోగం భారతదేశంలో ఇంతవరకూ జరగలేదు.
“అమ్మాస్” బియ్యం ఐదు రకాలుగా లభ్యమౌతున్నాయి.
1. క్లాసిక్ బిర్యానీ (బాసుమతి)
2. ప్రీమియం ఏరోమాటిక్ (బాసుమతి)
3. సూపర్ బాసుమతి (బాసుమతి)
4. చిట్టి ముత్యాలు (సోనా మసూరి)
5. అమృత బిందు (ఇడ్లీ బియ్యం)
పైన పేర్కొన్న బియ్యం రకాలు రోజువారీ వంటలు కాకుండా వివిధ రకాల ప్రాంతీయ వంటకాలు ఉదాహరణకు, పొంగల్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ చేయడానికి ఉపయోగించ వచ్చు. “అమృత బిందు” మాత్రం దక్షిణ భారత దేశంలో ప్రాచుర్యం పొందిన అల్పాహారం ఇడ్లీ చేయడానికి ఉపయోగిస్తుంది.
“అమ్మాస్” వారు వారి యొక్క ఎక్కువ నాణ్యత గల బియ్యం ప్రస్తుతం మార్కెట్ లో దొరుకుతున్న ఇతర రకాల బాసుమతి బియ్యం ధరకే అమ్ముతున్నారు.
మరో ముఖ్యమైన విషయం: అమ్మాస్ వారు ఈ బియ్యం అమ్మకంతో వచ్చిన లాభంలో ప్రతీ పైసా దాతృత్వ సంబందిత కార్యాలకు ఉపయోగించాలని భావిస్తూ అందరికీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అర్ధిస్తున్నారు. ఇప్పటికే ప్రజోపయోగమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం కూడా జరిగింది.