ఏమండోయ్ ! ఇవాళ ఎక్కువ బట్టలు వెయ్యకండి ! పని మనిషి రెండు రోజులు రానంది .
ఏమొచ్చింది ? అడిగాడు ప్రకాష్.
వాళ్ళ ఊరు వెడతాను, కూతురినీ మనుమలనూ చూసి వస్తాను అందండీ ! అక్కడ పండగట .
“సరేలే బట్టలు ఎక్కువ వెయ్యను ” అన్నాడు ప్రకాష్
“ఏమండీ ! పాపం దానికి ఒక 500 ఇస్తానండి . వినాయక చవితికి ఇచ్చినట్టు ఉంటుంది . పిల్ల దగ్గరకి వెడుతోంది కదా ! ఏదైనా పట్టుకు వెడుతుంది . ”
” నీ చేతికి ఎముక లేదు . వచ్చే దీపావళికి ఇద్డువులే ! . రేపు పిజ్జా కొనుక్కోవాలి ”
” ఈ వారం పిజ్జా మానేద్దాము . పాచిపోయిన 8 ముక్కాల బ్రెడ్ కోసం ఎందుకండీ ! దానికి ఇస్తే ఎంత సంతోషిస్తుందో… ?”
“మా పిజ్జా దానికి ఇచ్చెస్థావన్నమాట . సరే నీ ఇష్టం ” మనసులో ఏడుస్తూనే ఒప్పుకున్నాడు ప్రకాష్.
నాలుగు రోజుల తరువాత పనిమనిషి వచ్చింది
” పండుగ బాగా జరిగిందా ? ” అడిగాడు ప్రకాష్
సంతోషంగా చెప్పింది ఆమె
“అమ్మగారు నాకు 500 ఇచ్చారండి. రెండు రోజులు 500 ఖర్చు పెట్టి చాలా బాగా గడిపాము 150 పెట్టి మనవరాలుకి డ్రెస్ కొన్నాను .. 40 రూపాయలతో బొమ్మ కొన్ననండి . 50 రూపాయలతో స్వీట్స్ కొన్నానండి . 50 రూపాయలు గుడిలో ఇచ్చానండి . 60 రూపాయలు బస్ టిక్కెట్లు అయ్యాయండి. అల్లుడికి 50 రూపాయలు పెట్టి బెల్ట్ కొన్నానండి. 25 రూపాయలు పెట్టి అమ్మాయికి గాజులు కొన్నానండి. 75 రూపాయలు మిగిలాయండి. పిల్లకు కాపీ పుస్తకాలూ పెన్సిళ్ళూ కొనమని మా పిల్లకి ఇచ్చానండి.
ఆశ్చర్య పోయాడు ప్రకాష్. 500 రూపాయలతో ఇన్నా ?
తన 8 ముక్కల పిజ్జాను గురించి ఇలా అనుకున్నాడు
మొదటి ముక్క – 150 రూపాయల డ్రెస్
రెండో ముక్క -40 రూపాయల బొమ్మ
మూడో ముక్క – 50 రూపాయల స్వీట్స్
నాలుగో ముక్క – గుడిలో ఇచ్చిన 50 రూపాయలు
ఐదో ముక్క – బస్ టికెట్లు 60 రూపాయలు
ఆరో ముక్క – 50 రూపాయల అల్లుడి బెల్ట్
ఏదో ముక్క – 25 రూపాయలు గాజులు
ఎనిమిదో ముక్క – కాపీ పుస్తకాలూ పెన్సిళ్ళూ
ఎనిమిది ముక్కలో కళ్ళ ముందు తేలుతూ కనిపిస్తున్నాయి
ఇన్నాళ్ళూ పిజ్జా ఒక వైపే చూశాడు. పిజ్జా రెండో వైపు ఎలా ఉంటుందో పనిమనిషి ఖర్చు చూశాక తెలిసింది.
తనది ఖర్చు పెట్టడానికి జీవితం
ఆమెది జీవితం కోసం ఖర్చు పెట్టడం.
“Spending for life” or “ Life for spending…..
“విలాసం …. అవసరం …. అత్యవసరం”… తేడా తెలుసుకున్నవాళ్ళు ధన్యజీవులు….
Contributor: Dr.Ramprakash Yerramilli
Source: WhatsApp