ప్రముఖ నటులు, దర్శకులు, కవి, రచయిత…ఇలా వ్రాసుకుంటూ పొతే ఇంకా ఎన్నో వ్రాయవచ్చు. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అంటే ఇంకెవరు? శ్రీ తనికెళ్ళ భరణి గారే. ప్రవృత్తిని వృత్తిగా చేసుకొని షుమారు 30 ఏళ్ల తన సాహితీ సినీ జీవితంలో అలుపెరుగని ధీశాలి – తెలుగు వారి బంగారు భరణి – తనికెళ్ళ. తెర వెనుక, తెర పైన, మాసిన గడ్డం తోనో గీసిన గడ్డం తోనో తెలుగువారిని విలక్షణమైన పాత్రల్లో అలరించి ఒక పాత్ర కంటూ పరిమితి చెందక వేసిన ప్రతీ పాత్రలో వైవిధ్యాన్ని చూపించి చెరగని ముద్ర వేసిన కళాకారుడు. శ్రీ భరణి గారు వచ్చే ఆగస్టు నెలలో ఆస్ట్రేలియా మరొక్కసారి పర్యటించబోతున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయబడతాయి.
ఆస్ట్రేలియాకి శ్రీ తనికెళ్ళ భరణి
