బీజేపీ కొత్త ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు చేసిన ప్రమాణ స్వీకారంలో 46 మందిని మంత్రులుగా తీసుకున్నారు. ఇందులో 23 మంది క్యాబినెట్ మంత్రులు, 10 మంది స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 13 మంది సహాయమంత్రులు ఉన్నారు.
కాగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఆయన ఇద్దరికే అవకాశం ఇవ్వడం తెలుగు ప్రజలను నిర్ఘాంత పరచింది. ఆ ఇద్దరిలో ఒకరు బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు కాగా, రెండవ వారు టీడీపీకి చెందిన అశోక్ గజపతి రాజు. తెలంగాణా ప్రాంతంలో ఒక్కరికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. ఇక పార్టీలోని సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయకు మంత్రి పదవిని ఇవ్వకపోవడం తెలంగాణా రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది.
దత్తాత్రేయ సైతం దిగ్భ్రాంతి చెందారు. అయితే మరో మంత్రివర్గ విస్తరణలో ఆయన దత్తాత్రేయ పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.