ఎదురు తిరిగిన రాహుల్

నేరస్థులుగా శిక్షలు పడిన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా చేసే ఆర్డినెన్సు కు వ్యతిరేకంగా ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సు వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ఈ ఆర్డినెన్సు పరమ చెత్తగా ఉందనీ, దీన్ని వెంటనే చించేసి అవతల పారేయాలని వ్యాఖ్యానించడంతో ఈ ఆర్డినెన్సు మూలన పడినట్టయింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అమెరికా నుంచి రాగానే మంత్రి వర్గం దీన్ని ఉపసంహరించే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

రాహుల్ అభిప్రాయమే కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అని పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఆర్డినెన్సు ను వ్యతిరేకిస్తోందని, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసిన తరువాత రాహుల్ ఇటువంటి వ్యాఖ్యలు చేసారంటే దాని అర్థం ఏమిటి? ప్రభుత్వానికి ఎదురు తిరిగారని అర్థమా? మన్మోహన్ సింగ్ ను కించపరచాలని ప్రయత్నిస్తున్నట్టుగా భావించాలా?

రాహుల్ ఏది చెబితే అదే తుది మాట. మాకు అదే ముఖ్యం. అవినీతిపై పోరాడడానికి ఈ ఆర్డినెన్సు సరిపోదు అని మాకెన్ స్పష్టం చేసారు. “ఒక్క లాలూ కోసమో, రషీద్ మసూద్ కోసమో మొత్తం కాంగ్రెస్ ఎందుకు అవస్థలు పడాలి?” అని పార్టీ భావిస్తోంది. 1990లో లాలూ ప్రసాద్ యాదవ్ పశుగ్రాసం కేసులో నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్నారు. ఇందులో కోట్లాది రూపాయలు లాలూ హస్తగతంయ్యాయని సీబీఇ తెలిపింది. ఈ కేసుపై తుది కోర్టు నిర్ణయం ఈ నెల 30న వెలువడుతుంది. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా కేంద్రం ఈ ఆర్డినెన్సు ను హడావిడిగా తీసుకు వచ్చింది. ప్రస్తుతం ఆయన ఎంపీ గానే ఉన్నారు. ఆయన అనర్హుడు కాకూడదని, పదవిలో కొనసాగాలని కాంగ్రెస్ భావిస్తోంది.

ఈ ఆర్డినెన్సు గనుక బయటికి వస్తే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్ కూడా సభ్యుడుగా కొనసాగడానికి వీలుంటుంది. ఆయన అక్రమ మార్గాల ద్వారా చాలామంది అభ్యర్థులకు మెడిసిన్ లో సీట్లు ఇప్పించారు. ఆయన మీద అక్టోబర్ 1న తీర్పు రాబోతోంది. ఆయనను కాపాడాలని పార్టీ భావిస్తోంది. అయితే రాహుల్ గాంధి వ్యాఖ్యలతో లాలూ, మసూద్ ల పరిస్థితి గందరగోళంలో పడింది. రాహుల్ ఏది చెబితే అదే తుది మాట. మాకు అదే ముఖ్యం. అవినీతిపై పోరాడడానికి ఈ ఆర్డినెన్సు సరిపోదు అని మాకెన్ స్పష్టం చేసారు.

Send a Comment

Your email address will not be published.