ఎన్నికల బరిలోకి పవన్

ప్రముఖ హీరో, జన సేన పార్టీ నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఎన్నికల్లో పోటీపై మొట్టమొదటిసారి స్పష్టత ఇచ్చ్చారు. 2019లో జరగబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వఛ్చి ప్రజల కోసం, ప్రజల మనిషిగా పని చేస్తానని ఆయన అనంతపురంలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ చెప్పారు. “ఈ మాటలను గుండె లోతుల్లోంచి చెబుతున్నా.

వచ్ఛే ఏడాది ఏపీలో జనసేన తొలి కార్యాలయాన్ని అనంతపురంలో ప్రారంభిస్తా” అని ఆయన ప్రకటించారు. రాయల సీమలోని అనంతపురం జిల్లా నుంచే నేను ప్రజల తరఫున ప్రారంభిస్తా” అని కూడా ఆయన అన్నారు.

ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్యాకేజీకి ఒప్పుకోవడం బాగా లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Send a Comment

Your email address will not be published.