తెలంగాణా రాష్ట్రంలో 12 ఎం.ఎల్.సి స్థానాలకు ఎన్నికలు జరగబోతుండగా అందులో ఆరు స్థానాలలో అధికార తెలంగాణా రాష్ట్ర సమితి ఇప్పటికే విజయం సాధించింది.
నిజానికి ఈ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగాల్సి ఉంది. 30న ఫలితాలు వెలువడాల్సి ఉంది. అయితే, ఇందులో ఆరు స్థానాల నుంచి అధికార టి.ఆర్.ఎస్ అభ్యర్థులకు అనుకూలంగా ప్రతిపక్ష టి.డి.పి., కాంగ్రెస్ అభ్యర్థులు తమ పోటీని ఉపసంహరించుకోవడం జరిగింది. ఇది ఎలా జరిగిందో అర్థం కాక ప్రతిపక్ష నాయకులు విస్తుపోతున్నారు. తమకు పోటీ లేకపోవడంతో అధికార పక్ష అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. తమ అభ్యర్థులను అధికార పక్ష నాయకులు కొనుగోలు చేసినట్టు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా మిగిలిన ఆరు స్థానాలకు మాత్రం ఈ నెల 27న యథావిధిగా ఎన్నికలు జరగబోతున్నాయి.