కె.సి. ఆర్ కు కొత్త నివాస భవనం

తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నూతన అధికార నివాస గృహ ప్రవేశం చేశారు. గురువారం తెల్లవారు ఝామున ఆయన సతీ సమేతంగా ఈ నివాసంలో అడుగు పెట్టారు. ఈ నివాస గృహ సముదాయంలోనే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, నివాస భవనం, సాధారణ కార్యాలయం, సమావేశ మందిరం కూడా ఉన్నాయి. ఈ నివాస సముదాయానికి ‘ప్రగతి భవన్’గా  నామకరణం చేశారు. సమావేశ మందిరానికి మాత్రం జనహిత అని పేరు పెట్టారు. గృహ ప్రవేశం సందర్బంగా సర్వ మత ప్రార్థనలు జరిపారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు, చిన జీయర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి ఇక నుంచి ఎక్కువ సమయం ఈ నివాస సముదాయంలోనే గడుపుతారు. సుమారు ఎనిమిది ఎకరాల స్థలంలో యాభై  కోట్ల రూపాయల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు.

Send a Comment

Your email address will not be published.