ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త రాజధానిని ప్రకటించిన తరువాత నుంచీ విజయవాడ. తుళ్ళూరు ప్రాంతాల మధ్య స్థలాలు, భూములు కోట్ల రూపాయలలో ధరలు పలుకుతున్నాయి. విజయవాడ, మంగళగిరి, తుళ్ళూరు ప్రాంతాల్లో ఎకరం భూమి విలువ దాదాపు కోటీ 70 లక్షలకు చేరుకుంది. ఆరువేల జనాభా కూడా లేని తుళ్ళూరులో ఆరు రియల్ ఎస్టేట్ కార్యాలు వెలిశాయి. రెండు బిర్యాని రెస్టారెంట్లు ప్రారంభం అయ్యాయి. ఎప్పుడు చూసినా వందలాది కార్లతో గ్రామం క్రిక్కిరిసి పోతోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు బిజీ అయిపోయాయి.
విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో స్థలాల ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నాయి. గజం స్థలం విలువ 50 వేలు దాటిందని, ఈ ప్రాంతాల్లో స్థలం కొనేకన్నా గుంటూరులో ఇల్లు కట్టుకోవడం మంచిదని భావిస్తున్నారు.