తెలుగు భాషా పరిశోధకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ సాహితీవేత్త చేకూరి రామారావు (చేరా) గురువారం నాడు గుండె పోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. ఖమ్మం జిల్లా మధిర సమీపంలోని ఇల్లిందలపాడులో జన్మించిన చేరా 2002లొ రాసిన “స్మృతి కిరణం’ అనే వ్యాస సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. ఆయన అనేక విమర్సన గ్రంథాలు రాసారు. వందలాదిమందిని తెలుగు సాహిత్యంలో తీర్చిదిద్దారు.