వినాయక చతుర్ధి పండగ పర్వం మెల్బోర్న్ నగరంలో సందడే సందడి. నగరంలో పలు చోట్ల భారతీయ సంతతికి చెందిన వారు ఎంతో భక్తి ప్రపత్తులతో సంబరంగా జరుపుకొంటారు.
అయితే మన తెలుగు వారు శ్రీ అనిల్ దీప్ గౌడ్ గారు గత 5 సంవత్సరాలుగా వినాయక ఉత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుతున్నారు. 7 రోజుల పూజా కార్యక్రమం తు.చ. తప్పకుండా ప్రతీ రోజు నైవేద్యం భజనలతో టార్నీట్ లోను చుట్టు ప్రక్కల ఉన్న తెలుగు వారందరినీ పిలిచి అత్యంత ఆనంద భరితంగా జరుపుకున్నారు. శ్రీ అనిల్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం మన సంస్కృతిని కాపాడటం మరియు వచ్చే తరం పిల్లలకు తెలియపరచడమే ముఖ్యోద్దేశ్య మని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఎంతో మంది పలు విధాలుగా సహాయ సహకరందించారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కూడిన డబ్బు $ 3089.85 ఈ క్రింద నుదహరించిన రెండు సంస్థలకు అందజేయడం జరుగుతుందని శ్రీ అనిల్ గారు తెలిపారు.
1. Dakshinya Institute for the Mentally Handicapped (DIMH), Guntur. ( http://www.dakshinya.org/index.html )
2. Old Age Care (To be Confirmed).