టీడీపీ, బీజేపీల పొత్తు ఖరారు

గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య తెలంగాణా, సీమాంధ్ర రాష్ట్రాలలో సీట్ల సర్దుబాటు మీద జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. తెలంగాణా రాష్ట్రంలో కమలం గుర్తుకు 8 ఎంపీ స్థానాలు, 45 శాసనసభ స్థానాలకు కేటాయించడం జరిగింది. సీమాంధ్రలో సీట్ల సర్దుబాటు మీద ఇంకా చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇక్కడ 4 ఎంపీ స్థానాల్లోనూ, 12 శాసనసభ స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేయడానికి ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. నిజానికి తెలంగాణా రాష్ట్ర సమితితో తెలంగాణా సీట్లపై బీజేపీ చర్చలు జరుపుతోంది. అయితే బీజేపీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ కల్పించుకుని టీడీపీకే ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. తెలంగాణా రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ స్థానాలు, 117 శాసనసభ స్థానాలు ఉండగా, సీమాంధ్ర లో 25 ఎంపీ స్థానాలు, 175 శాసనసభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు కుదిరినందు వల్ల ఇక కాంగ్రెస్ తో పొత్తుకు టీఆర్ఎస్ ప్రయత్నించే అవకాశం ఉంది.

Send a Comment

Your email address will not be published.