తత్కాల్ రాజధాని!

ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా నవ్యాంధ్రలో కొత్త రాజధానిని నిర్మించాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కృత నిశ్చయంతో ఉన్నారు.

ఈ ఏడాది జూన్ కల్లా తాత్కాలిక రాజదానినయినా ఏర్పాటు చేసుకుని హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలని ఆయన భావిస్తున్నారు. జూన్ నెల నుంచి నవ్యాంధ్ర (ఆంధ్ర ప్రదేశ్) నుంచే పాలన సాగిస్తానని కూడా ఆయన ప్రకటించారు.

వీలయినన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఈ లోగా అక్కడికి తరలించడానికి అప్పుడే సన్నాహాలు కూడా ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం విజయవాడ, గుంటూరు నగరాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి సంస్థల కోసం ప్రకటన జారీ చేశారు. సుమారు అయిదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక కార్యాలయాలు నిర్మించడానికి ఈ నెల 18 లోగా నిర్మాణ సంస్థలు ముందుకు రావాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆరు నెలల్లో ప్రీ ఫాబ్రికేటేడ్ నిర్మాణాలను చేపట్టి, నయా రాజధాని నుంచే పాలన చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు కొనసాగడానికి అవకాశం ఉన్నప్పటికీ, సీమాంధ్రుల మనో భావాలను దృష్టిలో పెట్టుకుని ఆయన తాత్కాలిక రాజధాని మీద ఆలోచన ప్రారంభించారు.

Send a Comment

Your email address will not be published.