బహుముఖ ప్రజ్ఞాశాలి తనికెళ్ళ భరణికి అపూర్వ గౌరవం దక్కింది.
భరణి రాసిన తాజా పుస్తకం ప్యాసా ను బ్రిటీష్ పార్లమెంట్ లో ఆవిష్కరించారు. ఒక తెలుగు పుస్తకం బ్రిటీష్ పార్లమెంటులో ఆవిష్కరించడం ఇది మొదటిసారి.
ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ ఒమర్ ఖయ్యామ్ రుబాయిల ప్రేరణతో తాను ప్యాసా రాసినట్టు తెలిపారు. తాను గతంలో శివుడు గురించి రాసిన పుస్తకానికి విశేష ఆదరణ లభించిందని, ప్యాసా పుస్తకం ప్రేమ గురించి అని, అది విశ్వజనీనమైన అంశమని భరణి చెప్పారు. కనుక ప్యాసా పుస్తకం కూడా తప్పకుండా అందరి దృష్టి ఆకట్టుకుంటుందని అన్నారు.
బ్రిటీష్ పార్లమెంట్ సభ్యుడు డాన్ బైల్స్, యూ కె తెలుగు సంఘం ద్వారా ప్యాసా పుస్తకం బ్రిటీష్ పార్లమెంటులో ఆవిష్కరణకు నోచుకుందని, ఇందులో ఆంద్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ సహకారం కూడా ఉందని భరణి చెప్పారు. డాన్ బైల్స్ ఒక తెలుగమ్మాయిని పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఆ అమ్మాయి పేరు ప్రశాంతి రెడ్డి. ఈ పుస్తకం ఆవిష్కరణ సమయంలో మరో ఎంపీ లార్డ్ లూమ్బా కూడా హాజరయ్యారని ఆయన తెలిపారు.
ఈ మధ్యనే ఆస్ట్రేలియా లోని సిడ్నీ, మెల్బోర్న్ మరియు పెర్త్ నగరాల్లో ఆవిష్కృతమైంది.