తిరుమల తిరుపతి దేవస్థానంతో కలిసి తిరుపతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కాన్సర్ ఆస్పత్రి నెలకొల్పడానికి టాటా ట్రస్ట్ ముందుకు వచ్చింది. ఈ మేరకు టాటా ట్రస్ట్, దేవస్థానంల మధ్య ఒప్పందం కుదిరింది. తిరుపతిలో వేదిక్ విశ్వ విద్యాలయం పక్కన 25 ఎకరాల స్థలాన్ని ఇందు కోసం కేటాయించారు.
ఆస్పత్రి నిర్మాణానికి అయ్యే నూట నలభై కోట్ల ఖర్చులో వంద కోట్ల రూపాయలను ట్రస్ట్ ఖర్చు చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని దేవస్థానం అందజేస్తుంది. ఈ ఆస్పత్రి రెండేళ్లలో అందుబాటులోకి వస్తుంది. కాగా మరో పదిహేను రోజుల్లో తిరుపతిలోనే అరబిందో నేత్ర శాల నిర్మాణం మొదలవుతోంది.
తిరుపతిని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఈ.ఓ సాంబశివ రావు తెలిపారు.