తెలంగాణకు మంచి పేరు!

అభివృద్ధిలో తెలంగాణా రాష్ట్రం దేశంలో మూడవ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆయన మంత్రులు, ఉన్నతాధికారులతో రాష్ట్ర అభివృద్ధిపై ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి చేపట్టిన పతకాలు, కార్యక్రమాలను ప్రధానితో సహా కేంద్ర మంత్రులంతా వివిధ సందర్భాల్లో మెచ్చుకున్నారని ఆయన తెలిపారు. గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల తరువాత అభివృద్ధిలో ముందుకు వెడుతున్న రాష్ట్రం తెలంగాణా అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని హరిత వనంగా మారుస్తామని, ఇందుకోసం 240 కోట్ల మొక్కలను నాటే బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన తెలిపారు. నశించిపోయిన అడవుల్ని, పూడుకుపోయిన చెరువుల్ని మళ్ళీ పూర్వ స్థితికి తీసుకు వస్తున్నామని, పేదలకు 50 వేల ఇళ్లు నిర్మించే కార్యక్రమం కూడా చురుకుగా సాగుతోందని ఆయన తెలిపారు.

Send a Comment

Your email address will not be published.