తెలంగాణా రాష్ట్రంలో వచ్చే అయిదేళ్ళలో 40 కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్క ఈ వారంలోనే 13 జిల్లాల్లో 28 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ప్రభుత్వం నాలుగు లక్షల మందిని ఇప్పటికే నియోగించింది. మొక్కలు నాటిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడమే కాకుండా అయిదు గ్రేస్ మార్కులు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మొక్కల పెంపకంపై స్కూళ్లలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అది అధికారులను పురమాయించింది. మొక్కల పెంపకాన్ని ఐదో తరగతిలో పాఠ్య అంశంగా కూడా చేర్చింది.