తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన కొత్త పారిశ్రామిక విధానం దేశ విదేశాల నుంచి పరిశ్రమలను బాగా ఆకట్టుకుంటోంది. దేశీ లక్సరీ కార్ల మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న వోల్వో సంస్థ తెలంగాణాలో తమ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. గుజరాత్ రాష్ట్రంలో గానీ, కర్ణాటకలో గానీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఇంతవరకూ భావించిన వోల్వో ఇప్పుడు తెలంగాణాలో ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ సంస్థ ప్రతినిధులు తెలంగాణా ముఖ్యమంత్రిని కలుసుకుని తమ నిర్ణయం ప్రకటించారు. ఈ సంస్థ ఇటీవలే అమెరికాలో తమ ఉత్పత్తి ప్లాంట్ ని ప్రారంభించింది.