పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం జంట నగరాల్లో ఉచితంగా లక్ష ఇళ్ళు నిర్మించాలని తెలంగాణా ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రం మొత్తం మీద వచ్చే రెండేళ్లలో అయిదు లక్షల రెండు పడక గదుల ఇళ్ళు నిర్మించాలని కూడా ప్రభుత్వం బావిస్తోంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5.3 లక్షల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. అంటే లక్ష ఇళ్ళు నిర్మించడానికి సుమారు ఆరు వేలకోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఇందులో రూ 3.8 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఒకటిన్నర లక్ష కేంద్ర ప్రభుత్వం, మిగిలింది నగరపాలక సంస్థ భరించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం నిధుల కోసం ప్రభుత్వం వేట సాగిస్తోంది. కొన్ని జిల్లాలలో ఇప్పటికే ఇళ్ళ నిర్మాణం ప్రారంభం అయిపొయింది. ప్రభుత్వం రెండేళ్లలో లబ్దిదారులను గుర్తించి, ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.